Gold Price Today : తగ్గిన గోల్డ్ రేటు.. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా?

దేశ వ్యాప్తంగా సోమవారం వెండి ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై ..

Gold

Gold and Silver Price Today : సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బంగారం ధర తగ్గింది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన బంగారం, వెండి ధరలను ఓ సారి పరిశీలిద్దాం.


తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,700 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.70,580.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.64,850 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 70,730.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.64,700 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,580.
చెన్నైలో బంగారం ధర పెరిగింది. 10గ్రాముల 22 క్యారెట్లపై రూ. 200 పెరగ్గా.. 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 220 పెరిగింది. దీంతో ఇవాళ అక్కడ 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,700 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,580కు చేరింది.

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా సోమవారం వెండి ధర స్వల్పంగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 91,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.91,000.
కోల్ కతా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 85,700 వద్ద కొనసాగుతుంది.
ముంబయిలో కిలో వెండి ధర రూ. 85,700 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 750 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 85,000 వద్ద కొనసాగుతుంది


పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు