Graham Thorpe : శోక‌సంద్రంలో క్రికెట్ ప్ర‌పంచం.. 100 టెస్టులు ఆడిన క్రికెట‌ర్ క‌న్నుమూత‌..

క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు, మాజీ కోచ్ గ్రాహ‌మ్ థోర్ప్‌ క‌న్నుమూశారు.

Former England cricketer Graham Thorpe passes away at 55

Graham Thorpe : క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు, మాజీ కోచ్ గ్రాహ‌మ్ థోర్ప్‌ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 55 సంవ‌త్స‌రాలు. అనారోగ్య కార‌ణాల‌తో ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్ల‌డించింది. ఆయ‌న మ‌ర‌ణంతో క్రికెట్ ప్ర‌పంచం మొత్తం శోక‌సంద్రంలో మునిగిపోయింది.

గ్రాహ‌మ్ థోర్ప్‌ మ‌ర‌ణం షాక్‌కు గురి చేసింది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాం అని ఈసీబీ తెలిపింది.

IND vs SL 2nd ODI : రోహిత్ శ‌ర్మ మిస్ చేశాడు.. కోహ్లీ కొట్టేశాడు.. హిట్‌మ్యాన్ ఎక్స్‌ప్రెష‌న్స్ వైర‌ల్‌

గ్రాహం థోర్ప్‌ 1993 నుంచి 2005 మ‌ధ్య కాలంలో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఇంగ్లాండ్ త‌రుపున 100 టెస్టులు, 82 వ‌న్డేలు ఆడారు. టెస్టుల్లో 6744 ప‌రుగులు చేశారు. ఇందులో 16 శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 200 నాటౌట్‌. ఇక వ‌న్డేల విష‌యానికి వ‌స్తే.. 82 వ‌న్డేల్లో 2380 ప‌రుగులు చేశాడు. ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో 341 మ్యాచ్‌ల్లో 21,937 ప‌రుగులు చేశారు. అత‌డి త‌రంలో అత్యుత్త‌మ బ్యాట‌ర్ల‌లో ఒక‌డిగా కొన‌సాగాడు.

ఇక రిటైర్మెంట్ త‌ర్వాత అత‌డు ఇంగ్లాండ్‌ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా వ్య‌వ‌హ‌రించాడు. 2022 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఘోర ఓట‌మి త‌రువాత‌ బ్యాటింగ్ కోచ్‌గా త‌ప్పుకున్నాడు. ఆ త‌ర్వాత అఫ్గానిస్తాన్ హెడ్ కోచ్‌గా సేవ‌లు అందించాడు. అయితే.. బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొన్ని రోజుల‌కే అనారోగ్య కార‌ణాల‌తో మ‌ధ్య‌లోనే వైదొలిగాడు.

Rohit Sharma : మాజీ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌కు షాకిచ్చిన టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ‌..

ట్రెండింగ్ వార్తలు