IND vs SL 2nd ODI : రోహిత్ శర్మ మిస్ చేశాడు.. కోహ్లీ కొట్టేశాడు.. హిట్‌మ్యాన్ ఎక్స్‌ప్రెషన్స్ వైరల్
ఆదివారం కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది.
IND vs SL 2nd ODI : ఆదివారం కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇద్దరూ ఓ రనౌట్ చేయడంలో భాగస్వామ్యం అయ్యారు. రోహిత్ శర్మ విసిరిన బంతి వికెట్లను తాకడంలో విఫలం కాగా.. దాన్ని అందుకున్న కోహ్లీ పరిగెత్తుకుంటూ వెళ్లి వికెట్లను పడగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శ్రీలంక ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఇది జరిగింది. అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్‌లో లంక బ్యాటర్ జెఫ్రీ వాండర్సే మిడ్ ఆఫ్ దిశగా షాట్ ఆడాడు. సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే.. బంతిని అందుకున్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నాన్ స్ట్రైకర్ వైపు వికెట్ల వైపు బంతిని విసిరేశాడు. బాల్ వికెట్లను తాకలేదు. బ్యాటర్లు సింగిల్ పూర్తి చేశారు.
అయితే.. అకిల ధనుంజయ రెండో పరుగు కోసం ప్రయత్నించగా.. రోహిత్ విసిరిన బంతిని అందుకున్న కోహ్లీ తెలివిగా పరిగెత్తుకుంటూ వెళ్లి స్ట్రైకింగ్ ఎండ్ వైపు ఉన్న వికెట్లను పడగొట్టాడు. దీంతో ధనుంజయ రనౌట్ అయ్యాడు. దీన్ని చూసిన రోహిత్ శర్మ చిరునవ్వులు చిందించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. అవిష్క ఫెర్నాండో (40), కమిందు మెండిస్ (40) లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ రెండు, సిరాజ్, అక్షర్‌లు చెరో వికెట్ తీశారు.
Rohit Sharma : మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు షాకిచ్చిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
అనంతరం రోహిత్ శర్మ 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. అతడితో పాటు అక్షర్ పటేల్ (44), గిల్ (35) లు రాణించినా మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ 42.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. లంక బౌలర్లలో జెఫ్రీ వాండర్సే ఆరు వికెట్లతో భారత పతనాన్ని శాంసించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Rohit missed and Kohli hit ?? pic.twitter.com/CjpEn3TYQ6
— Virat Kohli Fan Club (@Trend_VKohli) August 4, 2024