Rohit Sharma : మాజీ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌కు షాకిచ్చిన టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ‌..

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

Rohit Sharma : మాజీ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌కు షాకిచ్చిన టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ‌..

Rohit surpasses Dravid to become fourth highest run scorer for India in ODIs

Rohit Sharma -Rahul Dravid : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ప‌లు రికార్డుల‌ను బ్రేక్ చేస్తున్నాడు. కొలంబో వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాది 64 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో వ‌న్డేల్లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు సాధించిన నాలుగో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా మాజీ క్రికెట్‌, మాజీ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

రాహుల్ ద్ర‌విడ్ 340 వ‌న్డేలు ఆడ‌గా 314 ఇన్నింగ్స్‌ల్లో 10768 చేశాడు. రెండో వ‌న్డేలో హాఫ్ సెంచ‌రీ చేసిన రోహిత్ శ‌ర్మ 264 వ‌న్డేల్లో 256 ఇన్నింగ్స్‌ల్లో 10831 ప‌రుగులతో ద్ర‌విడ్‌ను అధిగ‌మించాడు. ఇక వ‌న్డేల్లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. స‌చిన్ 463 వ‌న్డేల్లో 18426 ప‌రుగులు చేశాడు. ఆ త‌రువాత విరాట్ కోహ్లి 294 వ‌న్డేల్లో 13886 ప‌రుగులు చేశాడు.

జకోవిచ్ చిరకాల స్వప్నం నెరవేరింది.. కుమార్తెను హత్తుకొని కన్నీటి పర్యంతమైన టెన్నిస్ స్టార్.. వీడియో వైరల్

భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాళ్లు..

సచిన్ టెండూల్కర్ – 463 వ‌న్డేల్లో 18426 ప‌రుగులు
విరాట్ కోహ్లీ – 294 వ‌న్డేల్లో 13872 ప‌రుగులు
సౌరవ్ గంగూలీ – 308 వ‌న్డేల్లో 11221 ప‌రుగులు
రోహిత్ శర్మ – 264 వ‌న్డేల్లో 10831 ప‌రుగులు
రాహుల్ ద్రవిడ్ – 340 వ‌న్డేల్లో 10768 ప‌రుగులు
ఎంఎస్ ధోని – 347 వ‌న్డేల్లో 10599 ప‌రుగులు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రెండో వ‌న్డేల్లో శ్రీలంక మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 240 ప‌రుగులు చేసింది. లంక బ్యాట‌ర్ల‌లో ఫెర్నాండో (40), దునిత్ (39) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ మూడు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సిరాజ్‌, అక్ష‌ర్ లు చెరో వికెట్ సాధించారు.

IND vs SL : శ్రీలంకపై ఓటమి తరువాత రోహిత్ శర్మ స్పందన.. మిడిలార్డర్ బ్యాటింగ్ తీరుపై ఏమన్నాడంటే..?

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ 42.2 ఓవ‌ర్ల‌లో 208 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో 32 ప‌రుగుల తేడాతో లంక విజ‌యం సాధించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ‌(64) హాఫ్ సెంచ‌రీ బాద‌గా, గిల్ (35) ప‌రుగుల‌తో రాణించాడు. లంక బౌల‌ర్లో జెఫ్రీ వాండ‌ర్సే 6 వికెట్లు తీశాడు. అస‌లంక మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.