IND vs SL : శ్రీలంకపై ఓటమి తరువాత రోహిత్ శర్మ స్పందన.. మిడిలార్డర్ బ్యాటింగ్ తీరుపై ఏమన్నాడంటే..?

రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. నేను 65 పరుగులు చేయడానికి కారణం నా బ్యాటింగ్ శైలి. నేను దూకుడుగా బ్యాటింగ్ చేసేటప్పుడు

IND vs SL : శ్రీలంకపై ఓటమి తరువాత రోహిత్ శర్మ స్పందన.. మిడిలార్డర్ బ్యాటింగ్ తీరుపై ఏమన్నాడంటే..?

Rohit sharma,

Updated On : August 5, 2024 / 7:37 AM IST

Rohit Sharma : భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియం లో రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓటమి తరువాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఓటమిపై తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. నిలకడగా ఆడాలని అనుకున్నాం.. కానీ మా అంచనాలు పూర్తిగా తప్పాయని చెప్పాడు. మ్యాచ్ ఓడిపోయిన ప్రతీసారి బాదేస్తుంది. మా ముందు లక్ష్యానికి అనుగుణంగా స్ట్రైక్ రొటేట్ చేయడం సులభం అని మేము భావించాం. కానీ, వాండర్సే అద్భుత బౌలింగ్ తో ఆ ప్లాన్ ను దెబ్బతీసి ఆరు వికెట్లు పడగొట్టాడు. అతనిదే ఈ మ్యాచ్ విజయం అని రోహిత్ శర్మ అన్నారు.

Also Read : IND vs SL : శ్రేయాస్ అయ్యర్ సూపర్ డైరెక్ట్ త్రో.. షాకైన కమిందు.. వీడియో వైరల్.. రోహిత్ ఏమన్నాడంటే..

రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. నేను 65 పరుగులు చేయడానికి కారణం నా బ్యాటింగ్ శైలి. నేను దూకుడుగా బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పిచ్ స్వభావం మేం అర్థం చేసుకున్నాం. మిడిల్ ఓవర్లలో ఈ వికెట్ పై ఆడటం చాలా కష్టం. తొలి పవర్ ప్లేలోనే వీలైనన్ని పరుగులు చేయాలి. ఈరోజు మేం రాణించలేక పోయాం. ఈ వైఫల్యాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కానీ మా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం పై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని రోహిత్ శర్మ అన్నారు.

Also Read : Paris Olympics 2024 : బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే అందరికీ ఉచిత వీసా.. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు