Paris Olympics 2024 : బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే అందరికీ ఉచిత వీసా.. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు

మోహక్ నహ్తా తన లింక్డ్ ఇన్ లో ఫోస్ట్ ద్వారా ఆఫర్ గురించి చెప్పారు. అయితే, ఈ ఆఫర్ ప్రాసెస్ ఏంటో చెప్పాలంటూ లింక్డిన్ యూజర్లు ఈ పోస్ట్ ను తెగ వైరల్ చేశారు.

Paris Olympics 2024 : బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే అందరికీ ఉచిత వీసా.. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు

Neeraj Chopra

Mohak Nahta linkedin post : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు ఇప్పటి వరకు మూడు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. అయితే, స్వర్ణం కోసం భారత్ దేశం మొత్తం ఎదురు చూస్తోంది. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజన్ చోప్రా బంగారం పతకం సాధిస్తాడని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ స్వర్ణం సాధించాడు. ఇప్పుడు పారిస్ లోకూడా అదే ఫలితం పునరావృతం అవుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికితోడు నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే భారత దేశంలోని పౌరులందరికీ ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లేందుకు ఉచిత వీసా ఇవ్వడం జరుగుతుందని భారతీయ సంతతికి చెందిన వీసా స్టార్టప్ అట్లాస్ సీఈవో మోహక్ నహ్తా హామీ ఇచ్చారు.

Also Read: Allu Arjun : కేరళ వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ విరాళం.. ఎంతంటే..?

మోహక్ నహ్తా తన లింక్డ్ ఇన్ లో ఫోస్ట్ ద్వారా ఆఫర్ గురించి చెప్పారు. అయితే, ఈ ఆఫర్ ప్రాసెస్ ఏంటో చెప్పాలంటూ లింక్డ్ ఇన్ యూజర్లు పెద్దెత్తున రీ పోస్టులు చేశారు. దీనికి స్పందించిన మోహక్ నెహ్తా ఆఫర్ ప్రొసిజర్ ను వివరంగా చెప్తూ పోస్ట్ చేశారు. నీరజ్ గోల్డ్ మెల్ సాధిస్తే అందరికీ ఫ్రీ వీసా ఇస్తానని నేను జులై 30న చెప్పాను. ఆగస్టు 8న జావెలిన్ త్రో ఫైనల్ జరుగుతుంది. ఇందులో నీరజ్ స్వర్ణ పతకం గెలిస్తే నేను చెప్పినట్లుగా అందరికీ మా కంపెనీ తరపున ఒక్కరోజు ఫ్రీ వీసా ఇప్పిస్తాం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లాలనుకున్నా వీసా ఖర్చు మేమే భరిస్తామని క్లారిటీ ఇచ్చారు. మీ ఈ మెయిల్ కామెంట్ బాక్స్ లో పెట్టండి. వీసా పొందేందుకు వీలుగా మీకు ఓ అకౌంట్ క్రియేట్ చేస్తాం అని మెహక్ మరో పోస్ట్ లో క్లారిటీ ఇచ్చారు.

Also Read : IND vs SL : శ్రీలంకకు బిగ్‌షాక్‌.. ఇండియాతో రెండో వన్డేకు కీలక ప్లేయర్ దూరం

భారత్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఆగస్టు 6న పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో పాల్గొంటాడు. గ్రూప్ A క్వాలిఫికేషన్ రౌండ్ మధ్యాహ్నం 1:50 గంటలకు ప్రారంభమవుతుంది, తర్వాత గ్రూప్ B 3:20 PMకి ప్రారంభమవుతుంది. అదే రోజు నీరజ్ క్వాలిఫికేషన్ రౌండ్ నుండి విజయవంతంగా బయటపడితే.. ఆగస్టు 8న ఫైనల్ లో పోటీ పడతారు. ఫైనల్ పోటీ 8వ తేదీ రాత్రి 11.55 గంటలకు ప్రారంభమవుతుంది.

Mohak Nahta linkedin post

Mohak Nahta linkedin post