IND vs SL : శ్రీలంకకు బిగ్‌షాక్‌.. ఇండియాతో రెండో వన్డేకు కీలక ప్లేయర్ దూరం

వనిందు హసరంగ భారత్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. భారత్ ఇన్నింగ్స్ ప్రారంభంలో ..

IND vs SL : శ్రీలంకకు బిగ్‌షాక్‌.. ఇండియాతో రెండో వన్డేకు కీలక ప్లేయర్ దూరం

Wanindu Hasaranga

Wanindu Hasaranga : ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ లో ఇప్పటికే తొలి వన్డే పూర్తయింది. ఈ వన్డేలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో శ్రీలంక స్పిన్ దాటికి భారత్ బ్యాటర్లు తడబడటంతో మ్యాచ్ టై అయింది. ఇవాళ ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 2.30గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే, రెండు, మూడు వన్డేలకు శ్రీలంక జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టులోని కీలక ప్లేయర్ వనిందు హసరంగా వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. టీ20 సిరీస్ ను కోల్పోయిన శ్రీలంక జట్టు.. వన్డే సిరీస్ ను గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే, ఆ జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకరైన హసరంగా వన్డే సిరీస్ కు దూరం కావటం ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బేనని చెప్పొచ్చు.

Also Read : ఒలింపిక్స్‌లో ఇవాళ కీలక ఈవెంట్లు.. లక్ష్యసేన్ వైపు భారత్ చూపు.. 100 మీటర్ల పరుగులో విజేత ఎవరో?

వనిందు హసరంగ భారత్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. భారత్ ఇన్నింగ్స్ ప్రారంభంలో ప్రమాదకరమైన బ్యాటర్ విరాట్ కోహ్లీ(24)ని ఔట్ చేశాడు. అంతేకాదు.. కేఎల్ రాహుల్ (31)ను ఔట్ చేశాడు. చివరిలో కుల్దీప్ యాదవ్ (2) ను ఔట్ చేశాడు. తొలివన్డేలో మొత్తం పది ఓవర్లు వేసిన హసరంగ 58 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. హసరంగ బ్యాటింగ్ లోనూ రాణించాడు. 35 బంతుల్లో 24 పరుగులు చేశాడు. తొలి వన్డేలో శ్రీలంక జట్టు మ్యాచ్ ను టైగా ముగించడంలో కీలక భూమిక పోషించిన హసరంగ రెండు, మూడు వన్డేలకు దూరం కావటం శ్రీలంక జట్టుకు గట్టి దెబ్బేనని చెప్పొచ్చు.

Also Raed : Arshdeep Singh : తోపు బ్యాట‌ర్‌లా షాట్‌కు వెళ్లావా..! అర్ష్‌దీప్ సింగ్ పై నెట్టింట దారుణ ట్రోలింగ్‌..

తొలి వన్డేలో 10వ ఓవర్ చివరి బంతిని వేస్తున్న సమయంలో హసరంగ గాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం అతనికి ఎంఆర్ఐ స్కాన్ చేయగా.. గాయం అయినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో అతన్ని రెండు, మూడు వన్డేలకు తప్పించారు. హసరంగ స్థానంలో జెఫ్రీ వాండర్సే శ్రీలంక తుది జట్టులో చేరనున్నాడు.