Arshdeep Singh : తోపు బ్యాట‌ర్‌లా షాట్‌కు వెళ్లావా..! అర్ష్‌దీప్ సింగ్ పై నెట్టింట దారుణ ట్రోలింగ్‌..

కొలంబో వేదిక‌గా శుక్రవారం భార‌త్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్ టైగా ముగిసింది.

Arshdeep Singh : తోపు బ్యాట‌ర్‌లా షాట్‌కు వెళ్లావా..! అర్ష్‌దీప్ సింగ్ పై నెట్టింట దారుణ ట్రోలింగ్‌..

Arshdeep Singh Memes

Arshdeep Singh Memes : కొలంబో వేదిక‌గా శుక్రవారం భార‌త్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్ టైగా ముగిసింది. ఒకానొక ద‌శ‌లో భార‌త్ ఈజీగా విజ‌యం సాధిస్తుంద‌ని అనిపించిన‌ప్ప‌టికి అనూహ్యంగా త‌డ‌బ‌డింది. మ్యాచ్ ఆఖ‌ర్లో చేతిలో రెండు వికెట్లు ఉన్నా కూడా ఒక్క ప‌రుగు చేయ‌లేక‌పోయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 230 ప‌రుగులు చేసింది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో దునిత్ వెల్ల‌లాగే (67 నాటౌట్; 65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఓపెన‌ర్ పాతుమ్ నిస్సాంక (56; 75 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, అక్ష‌ర్ ప‌టేల్ లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. దూబె, సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్‌, వాష్టింగ్ట‌న్ సుంద‌ర్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Rohit Sharma : తొలి వ‌న్డేలో దీన్ని గ‌మ‌నించారా..? గ్రౌండ్‌లోనే వాషింగ్ట‌న్ సుంద‌ర్ పై రోహిత్ సీరియ‌స్‌..

అనంత‌రం 231 ప‌రుగుల ల‌క్ష్యంతో భార‌త్ బ‌రిలోకి దిగింది. ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ (58; 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. లంక బౌల‌ర్లు వ‌రుస విరామాల్లో వికెట్లు తీసిన‌ప్ప‌టికీ కేఎల్ రాహుల్ (31), అక్ష‌ర్ ప‌టేల్ (33), శివ‌మ్ దూబె(25) లు రాణించ‌డంతో భార‌త్ 47.3 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 230 ప‌రుగులు చేసింది. మ‌రో 15 బంతులు మిగిలి ఉండ‌గా ఒక్క ప‌రుగు చేస్తే మ‌న‌దే విజ‌యం. చేతిలో రెండు వికెట్లు ఉండ‌డం, క్రీజులో శివ‌మ్ దూబె ఉండ‌డంతో భార‌త్ ఈజీగా గెలుస్తుంద‌ని అంతా భావించారు.

అయితే.. లంక కెప్టెన్ చ‌రిత్ అస‌లంక మ్యాజిక్ చేశాడు. వ‌రుస బంతుల్లో శివ‌మ్ దూబె, అర్ష్‌దీప్ సింగ్‌ల‌ను ఔట్ చేశాడు. భార‌త్ గెల‌వ‌కుండా అడ్డుప‌డ్డాడు. త‌క్కువ ఎత్తులో వ‌చ్చిన బంతి దూబె ప్యాడ్ల‌ను తాకింది. వెంట‌నే లంక ఆట‌గాళ్లు ఎల్బీకి అప్పీల్ చేయ‌గా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఈ స‌మ‌యంలో దూబె, సిరాజ్‌లు ప‌రుగు పూర్తి చేశారు. అయితే లంక కెప్టెన్ చ‌రిత్ అస‌లంక రివ్య్వూకి వెళ్లాడు. రివ్య్వూలో దూబె ఎల్బీగా ఔట్ అయిన‌ట్లు తేలింది.

Harbhajan Singh : గతంలో ఏం జరిగిందో గుర్తు చేసుకో.. పాక్ జ‌ర్న‌లిస్ట్‌కి హ‌ర్భ‌జ‌న్ సింగ్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..

అంత అవ‌స‌ర‌మా..?

దూబె ఔట్ కావ‌డంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. 14 బంతుల్లో ఒక్క ప‌రుగే చేయాల్సి ఉంది. క్రీజులోకి వ‌చ్చాడు అర్ష్‌దీప్ సింగ్. అయితే.. సింగిల్ తీసినా, ఆ ఓవ‌ర్‌లోని మిగిలిన మూడు బంతుల‌ను అత‌డు డిఫెన్స్ ఆడినా వ‌చ్చిన న‌ష్టం ఏమీ ఉండ‌దు. ఆ మ‌రుస‌టి ఓవ‌ర్‌లోనైనా సిరాజ్ సింగిల్ తీసేవాడేమో. అయితే.. రెగ్యుల‌ర్ బ్యాటర్‌లా త‌న‌ను తాను భావించాడో ఏమో తెలీదు గానీ.. సిక్స్‌తో మ్యాచ్ ముగించాల‌ని అర్ష్‌దీప్ భావించాడు. భారీ షాట్ ఆడాడు.. కానీ బంతి అత‌డి బ్యాట్‌ను తాక‌లేదు. ప్యాడ్‌ను తాకింది. లంక ఆట‌గాళ్లు అప్పీల్ చేయ‌డం, అంపైర్ ఔట్ ఇవ్వ‌డం క్ష‌ణాల్లో జ‌రిగిపోయాయి. అర్ష్‌దీప్ రివ్య్వూకి వెళ్లిన లాభం లేక‌పోయింది.

అన‌వ‌స‌ర షాట్ ఆడాడ‌ని, సింగిల్ తీసినా పోయేద‌ని నెటిజ‌న్లు అర్ష్‌దీప్ సింగ్ పై మండిప‌డుతున్నారు. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. తోపు బ్యాట‌ర్‌లా ఫీలై షాట్‌కు వెళ్లావా.. ఇప్పుడు చూడు అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఇంకొంద‌రు మాత్రం అర్ష్‌దీప్‌కు మ‌ద్దతుగా నిలుస్తున్నారు. దూబెతో పాటు మిగిలిన వాళ్లు ఇంకాస్త బాధ్య‌త‌గా ఆడి ఉంటే బాగుండేద‌ని, అర్ష్‌దీప్‌ను విమ‌ర్శించ‌డం స‌రికాద‌ని అంటున్నారు.

IND vs PAK : అభిమానుల‌కు పండ‌గే.. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మూడు సార్లు త‌ల‌ప‌డ‌నున్న భార‌త్‌, పాకిస్తాన్‌..!