IND vs PAK : అభిమానుల‌కు పండ‌గే.. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మూడు సార్లు త‌ల‌ప‌డ‌నున్న భార‌త్‌, పాకిస్తాన్‌..!

వ‌చ్చే ఏడాది పాకిస్తాన్ వేదిక‌గా ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 జ‌ర‌గ‌నుంది.

IND vs PAK : అభిమానుల‌కు పండ‌గే.. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మూడు సార్లు త‌ల‌ప‌డ‌నున్న భార‌త్‌, పాకిస్తాన్‌..!

IND vs PAK

India vs Pakistan : వ‌చ్చే ఏడాది పాకిస్తాన్ వేదిక‌గా ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 జ‌ర‌గ‌నుంది. మొత్తం 8 దేశాలు ఈ టోర్నీలో పాల్గొన‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 19 నుంచి మార్చి 9 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీకి సంబంధించిన డ్రాప్ట్ షెడ్యూల్‌ను ఇప్ప‌టికే ఐసీసీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంద‌జేసింది. పాకిస్తాన్‌కు టీమ్ఇండియా వెళ్లే అవ‌కాశం లేద‌ని, హైబ్రిడ్ మోడ్‌లో టోర్నీని నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే ఐసీసీని బీసీసీఐ కోరింది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

గ‌త కొన్నాళ్లుగా భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు ద్వైపాక్షిక సిరీసుల్లో త‌ల‌ప‌డ‌డం లేదు. కేవ‌లం ఐసీసీ టోర్నీల్లోనే త‌ల‌ప‌డుతున్నాయి. భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. రెండు దేశాల అభిమానులే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తారు అని చెప్ప‌డంలో అతి శ‌యోక్తి లేదు.

PV Sindhu : ఒలింపిక్స్‌లో ఓట‌మి.. పీవీ సింధు కీల‌క వ్యాఖ్య‌లు..

ఇదిలా ఉంటే.. అభిమానుల‌కు మాత్రం ఓ కిక్ ఇచ్చే వార్త అందుతోంది. నివేదిక‌ల ప్ర‌కారం.. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్, పాకిస్తాన్‌లు గ్రూపు-ఏలో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. గ్రూపు-ఏలో భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల‌తో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జ‌ట్లు ఉన్నాయి. ఇక గ్రూపు-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, అఫ్గానిస్తాన్‌, ద‌క్షిణాఫ్రికాలు ఉన్నాయి. గ్రూపులోని ఒక్కొ జ‌ట్టు మిగిలిన జ‌ట్ల‌తో మ్యాచ్ ఆడ‌తాయి. ప్ర‌తి గ్రూపు నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సూప‌ర్‌-4కి చేరుకుంటాయి. సూప‌ర్‌-4 ద‌శ‌లో ఒక్కొ జ‌ట్టు మిగిలిన మూడు జ‌ట్ల‌తో మ్యాచ్‌లు ఆడ‌తాయి. టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు ఫైన‌ల్ అర్హ‌త సాధిస్తాయి.

ఈ లెక్క‌న‌ భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు మూడు సార్లు త‌ల‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఒకే గ్రూపులో ఉండ‌డంలో భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఖ‌చ్చితంగా ఓ మ్యాచ్ జ‌రుగుతోంది. ఇక రెండు జ‌ట్లు కూడా సూప‌ర్ ఫోర్‌కు క్వాలిఫై అయితే.. అక్క‌డ మ‌రోసారి పోటీప‌డ‌తాయి. సూప‌ర్ ఫోర్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే అప్పుడు మూడో సారి ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌తాయి.

Rohit Sharma : తొలి వ‌న్డేకు ముందు రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు.. పంత్, కేఎల్ రాహుల్‌ల‌లో వికెట్ కీప‌ర్‌గా ఎవ‌రంటే..?