Dream Home : దేశంలో అత్యంత వేగంగా డెవలప్ అవుతోన్న కాస్మోపాలిటన్ సిటీల్లో ఒకటి హైదరాబాద్. చక్కని ఎన్విరాన్‌మెంట్‌తో పాటు మౌలిక వసతులు మెరుగ్గా ఉండటంతో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నగరంలో ఇళ్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలకు హైదరాబాద్‌లో పర్మినెంట్ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తుండటంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. వచ్చే ఐదేళ్లు హైదరాబాద్ నిర్మాణ రంగానికి గోల్డెన్ పీరియడ్ అని నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్‌లో కొనసాగుతున్న రియల్ జోరు :
వివిధ కారణాలతో దేశంలోని ప్రధాన నగరాల్లో రియాల్టీ డెవలప్‌మెంట్ మందగిస్తే హైదరాబాద్ నగరంలో మాత్రం అందుకు భిన్నంగా రియల్ ఎస్టేట్ రంగం జోరును కొనసాగిస్తోంది. దేశంలోని కొన్ని నగరాలకు మాత్రమే ఉండే కొన్ని అవకాశాలు… హైదరాబాద్‌కు పుష్కలంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ విశ్వనగరంలో సొంతింటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టుల కోసం రియాల్టీ సంస్థలు అనుమతులు సంపాదించడంలో బిజీగా ఉన్నాయి.
Read Also : Director Apsar : శివుడి తత్త్వం, శివుడి విజువల్స్ అద్భుతంగా చూపించిన డైరెక్టర్ అప్సర్..
ప్రస్తుతం విశ్వనగరం ఔటర్ రింగ్ రోడ్డును దాటి విస్తరించింది. సిటీలోని ఏ ప్రాంతానికైనా రోడ్డు కనెక్టివిటీ పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాలను ఏమాత్రం తీసిపోని బహుళ అంతస్తుల భవనాలకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ ఎదిగింది. 40, 50 అంతస్తుల నిర్మాణాలను కూడా సిటీలో అలవోకగా చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు.
సింగిల్ విండో విధానంతో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లు, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ నుంచి అన్ని రకాల అనుమతులు వేగంగా వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ ఆన్‌లైన్‌లో TS బీపాస్ ద్వారా వస్తున్నాయి. టీఎస్ బీపాస్ ద్వారా గత ఏడాది ఇచ్చిన అనుమతులకు ఏమాత్రం తీసిపోకుండా ఈ ఏడాది ఇప్పటివరకు దరఖాస్తులు వస్తున్నాయి.
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ :
మరోవైపు ఈ ఏడాది ప్రారంభం నుంచి హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో నివాస స్థలాలతో పాటు ఇళ్ల కొనుగోళ్లు పెరిగినట్లు వివిధ కన్సల్టెన్సీ నివేదికలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయి. ఈ ఏడాది తొలి 6నెలల్లో నివాస సముదాయాల రిజిస్ట్రేషన్స్ 21శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యం 50 లక్షల నుంచి కోటి రూపాయల రేంజ్‌లో ఉన్న ఇళ్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ ఏడాది తొలి అర్ధభాగంగా వీటి అమ్మకాలు 47శాతం పెరిగాయి. ఇక కమర్షియల్ స్పేస్ విషయానికి వస్తే గతేడాదితో పోలిస్తే 40శాతం పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ సర్కార్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ చేసింది. దీంతో హైదరాబాద్‌లో నిర్మాణ యాక్టివిటీ భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే హైదరాబాద్‌లో నీటి కష్టాలు తగ్గడం, రోడ్ నెట్‌వర్క్ పెరగడంతో సిటీకి కాస్త దూరమైనా ప్రాపర్టీలను కొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. త్వరలో మెట్రో రైల్ విస్తరణ ప్రణాళికలు ఆచరణ రూపంలోకి రానుండటం… రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిగా ఉండటంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో నిర్మాణ యాక్టివిటీ శరవేగంగా పెరగనుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also : వలంటీర్లు మళ్లీ వచ్చేస్తున్నారు? పకడ్బందీగా వలంటీర్ వ్యవస్థను తీర్చిదిద్దాలని సర్కార్ యోచన!