Tech Companies Layoffs 2024 : టెక్ పరిశ్రమలో ఆగని ఉద్యోగాల కోతలు.. 2024లో ఏకంగా 32వేల మంది ఇంటికి.. ప్రధాన కారణాలివే..!

Tech Companies Layoffs 2024 : టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఉద్యోగాల కోతల్లో టెక్ కంపెనీలు తగ్గేదేలే అంటున్నాయి. 2024లో ఇప్పటివరకూ 32వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేశాయి.

Google, Microsoft, Meta and other tech companies continue job cuts in 2024

Tech Companies Layoffs 2024 : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావంతో టెక్ పరిశ్రమ అనేక కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఆ తర్వాత అదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. 2022 ఏడాది కూడా టెక్ కంపెనీలకు కఠినంగా ముగిసిందనే చెప్పాలి. ఆ తర్వాత 2023 ప్రారంభం కూడా టెక్ పరిశ్రమకు మరింత కఠినంగా మారింది.

వివిధ పరిశ్రమలలో ముఖ్యంగా టెక్ సెక్టార్‌లో విస్తృతంగా తొలగింపులు కొనసాగాయి. దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆదాయం తగ్గడం, ఉద్యోగ అనిశ్చితి, పెరిగిన ఒత్తిడి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను విస్తరించాయి. అయితే ఈ భయాందోళనలు అంతంత మాత్రంగానే కనిపించడం లేదు. ప్రపంచం 2024 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పటికీ ఉద్యోగుల తొలగింపు అనేది అంతం కాలేదు.

tech companies job cuts in 2024

2024లో 32వేల మంది ఉద్యోగుల తొలగింపు :
వాస్తవానికి, 2024 జనవరి నెలలో మరిన్ని లేఆఫ్‌లు జరిగాయి. రాబోయే నెలల్లో కూడా మరిన్ని టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల తొలగింపులు జరిగే అవకాశం ఉంది. బ్లూమ్‌బెర్గ్ ఇటీవలి నివేదికలో (Layoffs.fyi) డేటాను రివీల్ చేసింది. ఈ డేటా ప్రకారం.. 2024 ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 32వేల మంది టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.

Read Also : Best Phones in India : ఈ ఫిబ్రవరిలో రూ. 35వేల లోపు ధరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు!

దీనికి కారణం ఏమిటంటే.. కంపెనీల్లో పునర్నిర్మాణం, వ్యయ తగ్గింపు చర్యలలో భాగంగా అనేక టెక్ దిగ్గజాలు ఉద్యోగాల్లో కోతలు విధించాయి. ఇప్పటికీ అదే తంతు కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకూ Google, Amazon, Meta వంటి టెక్ సంస్థలతో పాటు టాప్ రేంజ్ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపేశాయి.

10శాతం ఉద్యోగుల తొలగింపు దిశగా స్నాప్‌చాట్ :
ఈ జాబితాలో ఇప్పుడు కొత్తగా స్పాప్‌చాట్ (Snapchat) పేరంట్ కంపెనీ స్నాప్ వచ్చి చేరింది. స్పాప్‌చాట్ ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీల్లోని 10 శాతం ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. తద్వారా కంపెనీ విభాగాల్లోని 540 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఇంతకుముందు, ఈ-కామర్స్ సైట్ ఈబే (ebay) మహమ్మారిలో భారీ నియామకాల తర్వాత 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్, సేల్స్‌ఫోర్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

tech companies layoffs

ఉద్యోగాల తొలగింపునకు ప్రధాన కారణాలివే :
లేఆఫ్స్ (Layoffs.fyi) కంపెనీ వ్యవస్థాపకుడు రోజర్ లీ ప్రకారం.. పెద్ద టెక్ కంపెనీలు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి రెండు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత అధిక నియామకాలు ఒకటైతే.. గత కొన్ని నెలలుగా వడ్డీ రేటు పెంపు, అధిక వడ్డీ రేటు, వాతావరణం, సాంకేతిక తిరోగమనం వంటివి కారణాలుగా అభిప్రాయపడ్డారు.

ఈ గడ్డు పరిస్థితులు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగడంతో మహమ్మారి సమయంలో టెక్ కంపెనీలు తమ పెద్ద మొత్తంలో నియామకాలు చేపట్టాయి. అయితే, ఇప్పుడు ఆ నియామకాల భారాన్ని తగ్గించుకోవడానికి తొలగింపుల దిశగా ప్రయత్నిస్తున్నాయని ఆయన ఇమెయిల్‌ ద్వారా తెలిపారు. ఈ సంవత్సరం తొలగింపులు సాధారణంగా ఒక ఏడాది క్రితం ఉద్యోగుల తొలగింపుల కన్నా తక్కువనే చెప్పాలి.

ఏఐ రేసులో పోటీపడుతున్న టెక్ దిగ్గజాలు :
ఉద్యోగుల తొలగింపులకు మరో ప్రధాన కారణం.. ఏఐ (కృత్రిమ మేధస్సు) రేసు. ఇప్పటికే ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పురోగతి కోసం పోటీపడుతున్నాయి. ఏఐ ప్రతిభపై దృష్టి పెట్టడానికి తగిన వనరులను మారుస్తున్నాయని లీ పేర్కొన్నారు.

tech companies job cuts

ఇటీవలి విశ్లేషణలో (CompTIA) కృత్రిమ మేధస్సుతో కూడిన లేదా ఏఐ నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలు డిసెంబర్ నుంచి జనవరి వరకు 2వేల నుంచి 17,479కి పెరిగాయని గుర్తించింది. టెక్ కంపెనీల్లో ఏఐ రేసు పోటీకి తగినట్టుగా మరింత రిక్రూట్‌మెంట్‌ను ప్రోత్సహిస్తోంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో మరింత నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని నివేదిక కాంప్‌టిఐఎ నివేదిక తెలిపింది.

గత జనవరిలోనే సంబంధిత రంగంలో 33,727 యాక్టివ్ జాబ్ పోస్టింగ్‌లు ఉన్నాయని వెల్లడించింది. 12 నెలల్లో నెలవారీగా అతిపెద్ద పెరుగుదలగా గుర్తించింది. నివేదిక ప్రకారం.. ఏఐ రీసెర్చర్, సీనియర్ అప్లైడ్ సైంటిస్ట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్, ఏఐ టెక్నికల్ సొల్యూషన్స్ లీడ్, మెషిన్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, రోబోటిక్స్ అల్గారిథమ్స్ ఇంజనీర్, జెనరేటివ్ ఏఐ క్వాలిటీ ఇంజనీర్, ఏఐ లెర్నింగ్ ఇంజనీర్, మ్యాచింగ్ ఇంజినీర్ వంటి ఉద్యోగాల లభ్యత ఎక్కువగా ఉన్న ఏఐ సంబంధిత రోల్స్ ఉన్నాయి.

Read Also : OnePlus 12R Sale Today : వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ బడ్స్ 3 సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు, ధర, బ్యాంకు ఆఫర్లు మీకోసం..

ట్రెండింగ్ వార్తలు