Huawei Watch Fit 2 : అమోల్డ్ స్ర్కీన్‌తో హువావే వాచ్ ఫిట్ 2 వచ్చేసింది.. 10 రోజుల బ్యాటరీ లైఫ్.. భారత్‌లో ధర ఎంతంటే?

Huawei Watch Fit 2 : సాధారణ వినియోగంతో గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్, ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్లేబ్యాక్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. అనేక హెల్త్-ట్రాకింగ్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.

Huawei Watch Fit 2 With 1.74-Inch AMOLED Screen ( Image Source : Google )

Huawei Watch Fit 2 : కొత్త స్మార్ట్ వాచ్ చూశారా? అద్భుతమైన అమోల్డ్ స్క్రీన్ డిస్‌ప్లేతో హువావే వాచ్ ఫిట్ 2 వచ్చేసింది. గతంలో హువావే వాచ్ ఫిట్ 2 ఎంపిక చేసిన యూరోపియన్ మార్కెట్‌లలో మాత్రమే ఆవిష్కరించింది. కానీ, ఇప్పుడు ఈ కొత్త స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లోకి కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఆల్వేస్-ఆన్-డిస్ప్లే (AOD) సపోర్ట్‌తో 1.74-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది.

Read Also : Volvo Electric SUVs : కొత్త కారు కోసం చూస్తున్నారా? భారత్‌కు వోల్వో నుంచి 2 సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు..!

ప్రెస్-టు-రిలీజ్ ‘లింక్’ డిజైన్‌తో మార్చుకోగలిగిన బెల్ట్‌లతో వస్తుంది. సాధారణ వినియోగంతో గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్, ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్లేబ్యాక్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. అనేక హెల్త్-ట్రాకింగ్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. మల్టీ ప్రీసెట్ వర్కౌట్ మోడ్‌లు, క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను కూడా కలిగి ఉంది.

భారత్‌లో హువావే వాచ్ ఫిట్ 2 ధర, లభ్యత :
అమెజాన్‌లో మిడ్ నైట్ బ్లాక్ యాక్టివ్ ఎడిషన్ హువావే వాచ్ ఫిట్ 2 ఫోన్ ధర రూ. 9,998కు పొందవచ్చు. ఇ-కామర్స్ సైట్‌లో ఇతర కలర్ లేదా స్టాప్ ఆప్షన్ల జాబితా అందించడం లేదు. హువావే వాచ్ ఫిట్ 2 గ్లోబల్ వేరియంట్ మూడు వెర్షన్‌లలో అందిస్తోంది. అందులో యాక్టివ్ ఎడిషన్, క్లాసిక్ ఎడిషన్ ఎలిగెంట్ ఎడిషన్ ఉన్నాయి. ఈ వెర్షన్లలో ప్రతి ఒక్కటి స్ట్రాప్, కేస్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

హువావే వాచ్ ఫిట్ 2 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
హువావే వాచ్ ఫిట్ 2 మోడల్ 336×480 పిక్సెల్స్ రిజల్యూషన్, 336పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో 1.74-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆల్వేస్-ఆన్-డిస్ప్లే (AOD) ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. మల్టీ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. మీరు వాచ్ ఫేస్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెక్టాంగ్యులర్ వాచ్ కేస్ ప్రెస్-టు-రిలీజ్ ‘లింక్’ డిజైన్, రైట్ ఎడ్జ్ సైడ్ బటన్‌ను కలిగి ఉంది. హువావే వాచ్ ఫిట్ 2 ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ (SpO2) లెవల్ మానిటర్, అలాగే నిద్ర, ఒత్తిడి స్థాయి ట్రాకర్‌లను కలిగి ఉంది.

ఈ సెన్సార్ల నుంచి డేటాను హువావే హెల్త్ యాప్ ద్వారా మానిటరింగ్ చేయొచ్చు. స్మార్ట్ వాచ్ ఏడు ప్రీసెట్ వర్కౌట్ మోడ్‌లతో వస్తుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ 5.2 కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. హువావే ఫోన్ యాప్‌లోని ప్లే లిస్టుల ద్వారా బ్లూటూత్ కాలింగ్, ఇండిపెండింట్ మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అనుమతిస్తుంది. హువావే వాచ్ ఫిట్ 2 సాధారణ వినియోగంతో గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్, భారీ వినియోగంతో ఏడు రోజుల వరకు అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Read Also : Hyundai SUV : ఈ హ్యుందాయ్ ఎస్‌యూవీ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏయే వేరియంట్లపై ఎంత ధర తగ్గిందంటే?

ట్రెండింగ్ వార్తలు