Hyderabad Residential Market : రియాల్టీలో హైదరాబాద్ జోరు.. దేశంలోనే రెండో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్‌ : నైట్ ఫ్రాంక్ ఇండియా

Hyderabad Residential Market : దేశంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా లేటెస్ట్ అఫర్డబిలిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది.

Hyderabad ranks as second most expensive residential ( Image Source : Google )

Hyderabad Residential Market : రియాల్టీలో హైదరాబాద్ మహానగరం దూసుకుపోతోంది. దేశంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా లేటెస్ట్ అఫర్డబిలిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఈఎంఐ(EMI)ని ఆదాయంతో పోల్చిన నగరంగా స్థోమత నిష్పత్తి 2024 మొదటి అర్ధభాగంలో 30 శాతంగా ఉంది. 2023లో అదే స్థాయిని కొనసాగిస్తోంది. మొదటి ఎనిమిది నగరాల్లో అహ్మదాబాద్ అత్యంత సరసమైన రెసిడెన్షియల్ మార్కెట్‌గా ఉంది.

21 శాతం నిష్పత్తితో పుణె, కోల్‌కతా 24 శాతం చొప్పున ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముంబై స్థోమత పరిమితి 51 శాతం కన్నా ఎక్కువగా ఉంది. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ నగరం స్థోమత సూచిక గణనీయమైన మార్పులను చవిచూసింది. 2010లో, ఈ నిష్పత్తి 47 శాతంగా ఉండగా, 2019 నాటికి 34 శాతానికి పడిపోయింది. 2020లో 31 శాతానికి తగ్గింది. 2021లో దాని కనిష్ట స్థాయి 28 శాతానికి చేరుకుంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. 2022, 2023, 2024 ప్రథమార్థంలో నిష్పత్తి 30 శాతం వద్ద స్థిరంగా నిలిచింది.

Read Also : Hyundai SUV : ఈ హ్యుందాయ్ ఎస్‌యూవీ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏయే వేరియంట్లపై ఎంత ధర తగ్గిందంటే?

నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్, గృహ కొనుగోలుదారుల డిమాండ్, విక్రయాలను నిలబెట్టడానికి స్థిరమైన స్థోమత అవసరమని, దేశానికి కీలకమైన ఆర్థిక చోదకంగా పని చేస్తుందని సూచించారు. ఆదాయ స్థాయిలు పెరగడం, ఆర్థిక వృద్ధి బలపడడంతో తుది వినియోగదారుల ఆర్థిక విశ్వాసం గణనీయంగా బలపడుతుంది. 2025 ఆర్థిక సంవత్సరం కోసం ఆర్బీఐ 7.2. శాతం జీడీపీ వృద్ధి అంచనా వేస్తోంది.

స్థిరమైన వడ్డీ రేటు దృష్టాంతంలో ఆదాయం, స్థోమత స్థాయిలు 2024లో గృహ కొనుగోలుదారుల డిమాండ్‌కు మద్దతునిస్తాయని భావిస్తున్నారని ఆయన చెప్పారు. 2010లో హైదరాబాద్‌లో చదరపు అడుగు వెయిటెడ్ సగటు ధర రూ. 2,728గా ఉందని, 2019లో రూ.4,500కి పెరిగిందని నివేదిక పేర్కొంది. 2024 మొదటి అర్ధభాగం నాటికి ధరలు క్రమంగా రూ.5,681కి పెరిగాయి. 2019 నుంచి 26 శాతం పెరుగుదల, 2023 మొదటి అర్ధభాగంతో పోలిస్తే 5 శాతం పెరుగుదల కనిపించింది.

భారత్‌లో ప్రముఖ 8 నగరాల స్థోమత సూచిక వివరాలివే :

హైదరాబాద్ :
2010: 47శాతం
2019: 34శాతం
2020: 31శాతం
2021: 28శాతం
2022: 30శాతం
2023: 30శాతం
హెచ్1 2024 : 30శాతం

ముంబై
2010: 93శాతం
2019: 67శాతం
2020: 61శాతం
2021: 52శాతం
2022: 53శాతం
2023: 51శాతం
హెచ్1 2024: 51శాతం

ఎన్‌‌సీఆర్

2010: 53శాతం
2019: 34శాతం
2020: 38శాతం
2021: 28శాతం
2022: 29శాతం
2023: 27శాతం
హెచ్1 2024: 28శాతం

బెంగళూరు

2010: 48శాతం
2019: 32శాతం
2020: 28శాతం
2021: 26శాతం

2022: 27శాతం
2023: 26శాతం
హెచ్1 2024: 26శాతం

చెన్నై

2010: 51శాతం
2019: 30శాతం
2020: 26శాతం
2021: 24శాతం
2022: 27శాతం
2023: 25శాతం
హెచ్1 2024: 25శాతం

పూణె

2010: 39శాతం
2019: 29శాతం
2020: 26శాతం
2021: 24శాతం
2022: 25శాతం
2023: 24శాతం
హెచ్1 2024: 24శాతం

కోల్‌కతా

2010: 45శాతం
2019: 32శాతం
2020: 30శాతం
2021: 25శాతం
2022: 25శాతం
2023: 24శాతం
హెచ్1 2024: 24శాతం

అహ్మదాబాద్

2010: 46శాతం
2019: 25శాతం
2020: 24శాతం
2021: 20శాతం
2022: 22శాతం
2023: 21శాతం
హెచ్1 2024: 21శాతం

Read Also : Tata Curvv EV Launch : అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో టాటా కర్వ్ ఈవీ కారు వచ్చేసిందోచ్.. సింగిల్ ఛార్జ్‌తో 585 కి.మీ దూసుకెళ్తుంది..!

ట్రెండింగ్ వార్తలు