ISRO Free Courses : విద్యార్థులకు ఇస్రో ఆఫర్.. ఫ్రీగా 5 రోజుల ఏఐ, మిషన్ లెర్నింగ్ కోర్సు.. సర్టిఫికేట్ కూడా..!

ISRO Free Courses : ఐఐఆర్‌ఎస్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 'ఐఐఎస్'పై ఈ ఉచిత 5-రోజుల కోర్సును అందిస్తోంది. అంతరిక్ష రంగంలో సరికొత్త ఆవిష్కరణలను అందించడమే లక్ష్యంతో ఈ అత్యాధునిక కోర్సులను అందించనుంది.

Isro offers free 5-day AI, ML course for students, certificate on completion ( Image Source : Google )

Isro Free Courses : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML)లో అవసరమైన నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆగస్టు 19 నుంచి 23 వరకు ఫ్రీ 5-రోజుల ఆన్‌లైన్ కోర్సును నిర్వహించబోతోంది. ఐఐఆర్‌ఎస్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘ఐఐఎస్’పై ఈ ఉచిత 5-రోజుల కోర్సును అందిస్తోంది. అంతరిక్ష రంగంలో సరికొత్త ఆవిష్కరణలను అందించడమే లక్ష్యంతో ఈ అత్యాధునిక కోర్సులను అందించనుంది.

Read Also : August Long Weekend : ఆగస్టులో లాంగ్ వీకెండ్ ప్లాన్స్.. ఆఫీసులో పని తప్పించుకోవడానికి ఉద్యోగుల తంటాలు.. కడుపుబ్బా నవ్వించే మీమ్స్..!

ఈ కోర్సు ప్రొగ్రామ్‌కు  హాజరు కావడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 2007లో ప్రారంభమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (IIRS) ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ 3,500 పైగా నెట్‌వర్క్ ఇన్‌స్టిట్యూట్‌లకు విస్తరించింది. యూనివర్శిటీలు, ప్రభుత్వ విభాగాలు, పరిశోధనా సంస్థలు, ఎన్‌జీఓలకు ప్రయోజనం చేకూర్చింది. జియోస్పేషియల్ టెక్నాలజీ, అప్లికేషన్లలో కెపాసిటీ బిల్డింగ్‌ను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించింది.

కోర్సు అర్హతలివే :
ఫ్రీ ఇస్రో కోర్సు సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, జియోఇన్ఫర్మేటిక్స్ వంటి రంగాలలో నిపుణులు, విద్యార్థులు, పరిశోధకుల కోసం రూపొందించింది. జియోస్పేషియల్ అప్లికేషన్‌ల కోసం ఏఐ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ (DL)ని అన్వేషించడానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సు వివరాలివే :
ఇస్రో కోర్సులో ఈ కింది విస్తృత అంశాలు కవర్ చేస్తుంది.

ఏఐ/మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇంట్రడక్షన్
మెషీన్ లెర్నింగ్‌లో మెథడ్స్ : సూపర్‌వైజడ్, అన్ సూపర్‌వైజడ్, రీఎన్‌ఫోర్స్‌మెంట్
సీఎన్ఎన్, ఆర్ఎన్ఎన్, ఆర్-సీఎన్ఎన్, స్పీడ్ ఆర్‌సీఎన్ఎన్, ఎస్ఎస్‌డీ, వైఓఎల్ఓ మొదలైన వాటి ద్వారా డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్
స్పేస్‌బోర్న్ లిడార్ సిస్టమ్స్
గూగుల్ ఎర్త్ ఇంజిన్ ద్వారా మెషిన్ లెర్నింగ్
మెషిన్/డీప్ లెర్నింగ్ మోడల్స్ కోసం పైథాన్
ఆగస్టు 19-23, 2024 నుంచి షెడ్యూల్ చేసిన ఈ కోర్సులో ఇ-క్లాస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా లెక్చర్ స్లయిడ్‌లు, వీడియో-రికార్డెడ్ లెక్చర్‌లు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్, డెమోన్‌స్ట్రేషన్ హ్యాండ్‌అవుట్‌లు అందిస్తుంది.

స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, బేసిక్ కంప్యూటర్ హార్డ్‌వేర్ మాత్రమే అవసరమయ్యే ఈ కోర్సు IIRS-ISRO ఇ-క్లాస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది.

కోర్సు షెడ్యూల్ :
ఈ ఇస్రో కోర్సులో ఆన్‌లైన్ లెక్చర్‌లు ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5:30 వరకు జరుగుతాయి.

ఆగస్ట్ 19 : ఏఐ/ఎమ్ఎల్ డీఎల్‌తో ఇంట్రడక్షన్ – డాక్టర్ పూనమ్ సేథ్ తివారీ
ఆగస్ట్ 20 : మెషీన్ లెర్నింగ్‌లో మెథడ్స్ : సూపర్‌వైజడ్, అన్ సూపర్‌వైజడ్, రీఎన్‌ఫోర్స్‌మెంట్ – డా. హీనా పాండే
ఆగస్ట్ 21 : డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్‌లు : సీఎన్ఎన్, ఆర్ఎన్ఎన్, ఆర్-సీఎన్ఎన్, స్పీడ్ ఆర్‌సీఎన్ఎన్, ఎస్ఎస్‌డీ, వైఓఎల్ఓ, అప్లికేషన్లు మొదలైనవి – డా. పూనమ్ సేథ్ తివారీ
ఆగస్ట్ 22 : గూగుల్ ఎర్త్ ఇంజిన్ ద్వారా మెషిన్ లెర్నింగ్ – డా. కమల్ పాండే
ఆగస్ట్ 23 : పైథాన్ ఫర్ మెషిన్/డీప్ లెర్నింగ్ మోడల్స్ – రవి భండారి
కోర్సు అప్‌డేట్‌లు, ఇతర వివరాలు IIRS వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

ఎలా దరఖాస్తు చేయాలి? :
ఈ ఇస్రో కోర్సు పాల్గొనేవారు తమ పేర్లతో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ లింక్ ద్వారా వారి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ మొదట వచ్చిన వారికి ముందుగా అందిస్తుంది. వ్యక్తిగత రిజిస్ట్రేషన్‌ల కోసం ఆమోదం ఆటోమాటిక్‌గా ఉంటుంది. కోర్సులో పాల్గొనేవారు ఇస్రో ఎల్ఎమ్ఎస్ కోసం లాగిన్ వివరాలను అందుకుంటారు. పాల్గొనేవారు నోడల్ సెంటర్ కోఆర్డినేటర్ ఆమోదంతో నోడల్ సెంటర్ల ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఆమోదం పెండింగ్‌లో ఉంటే.. పాల్గొనేవారు వారి సంబంధిత నోడల్ సెంటర్ కోఆర్డినేటర్‌ను సంప్రదించాలి. సంస్థాగత భాగస్వామ్యం కోసం సంస్థలు తమ ఇన్‌స్టిట్యూట్‌ను నోడల్ సెంటర్‌గా రిజిస్టర్ చేసుకోవడానికి తప్పనిసరిగా కోఆర్డినేటర్‌ను గుర్తించాలి.

సర్టిఫికేట్ అవార్డు :
విద్యార్థులు కనీసం 70శాతం హాజరుతో కోర్సును పూర్తి చేసిన తర్వాత ‘కోర్సు పార్టిసిపేషన్ సర్టిఫికేట్’ అందుకుంటారు. ఈ సర్టిఫికేట్ ఇస్రో లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS)లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఇస్రో ద్వారా కోర్సులో పాల్గొనే విద్యార్థులు ఏఐ నైపుణ్యాలను మెరుగుపరచడానికి భారత్ అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష రంగానికి దోహదపడేందుకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో మీ జ్ఞానాన్ని, సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఈ అవకాశాన్ని కోల్పోకండి.

Read Also : Bajaj Chetak 3201 Edition : కొత్త స్కూటర్ ఇదిగో.. అమెజాన్‌లో బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్, ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు