Mr Bachchan : మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మిరపకాయ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే తెలుగులో ఈ చిత్రంతోనే పరిచయం అవుతుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ట్రైలర్ ను విడుదల చేసింది. “సరిహద్దును కాపాడే వాడే సైనికుడు కాదు.. సంపదను కాపాడే వాడు కూడా సైనికుడు.” అనే రవితేజ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. రవితేజ యాక్టింగ్‌తో కుమ్మేశాడు. తనదైన కామెడీ టైమ్‌తో అలరించాడు. మొత్తంగా డైలాగ్‌లు, హరీశ్ శంకర్ టేకింగ్ ఆకట్టుకుంటున్నాయి. పాత రవితేజను చూసిన ఫీలింగ్ కలుగుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.
Samantha : వాట్.. ఆ సిరీస్‌కి సమంత అంత రెమ్యునరేషన్ తీసుకుందా? ఫస్ట్ సౌత్ హీరోయిన్‌గా రికార్డ్..?