Samantha : వాట్.. ఆ సిరీస్‌కి సమంత అంత రెమ్యునరేషన్ తీసుకుందా? ఫస్ట్ సౌత్ హీరోయిన్గా రికార్డ్..?
సిటాడెల్ వెబ్ సిరీస్ కి సమంత తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చగా మారింది.
Samantha : సమంత గత సంవత్సరం నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన హెల్త్ మీద ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలు, సిరీస్ లు ఓకే చేస్తుంది. సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్ ఓటీటీలో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ తో సమంత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సిరీస్ టీజర్ రిలీజవ్వగా ఇందులో సమంత యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది.
అయితే ఈ సిరీస్ కి సమంత తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చగా మారింది. సాధారణంగా బాలీవుడ్ లో హీరోయిన్స్ కి కూడా రెమ్యునరేషన్ ఎక్కువే ఇస్తారని తెలిసిందే. అయితే సమంత సిటాడెల్ సిరీస్ కి గాను ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందని బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ లో ఇంత రెమ్యునరేషన్ అందుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ కూడా సమంతనే అని అంటున్నారు.
సాధారణంగా సమంత రెండు నుంచి మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. సౌత్ లో గరిష్టంగా నయనతార 5 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. నయనతార జవాన్ సినిమాకు బాలీవుడ్ లో 8 నుంచి 10 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. ఇప్పుడు సమంత సిటాడెల్ కు 10 కోట్లు తీసుకుంది. దీంతో నయనతార, సమంతలో ఎవరు ఎక్కువ తీసుకున్నారు అని చర్చగా మారింది. అలాగే వీరిద్దరిలో బాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ ఎవరు అని కూడా ఫ్యాన్స్ లో చర్చ జరుగుతుంది.
ఇక సమంత బాలీవుడ్ లోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే ఒక సినిమా ప్రకటించిన సమంత, బాలీవుడ్ లో మరో సిరీస్ ఓకే చేసింది.