Harish Shankar – Bhagyashri Borse : హీరోయిన్ వెనక పడుతున్న డైరెక్టర్.. ఫోటో వైరల్.. డైరెక్టర్ ఏమన్నాడంటే..
తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీ యూనిట్ అంతా కలిసి సెలబ్రేషన్స్ చేసుకోగా సినిమా షూట్ లో జరిగిన జ్ఞాపకాలని కూడా పంచుకున్నారు.

Harish Shankar Bhagyashri Borse Photo from Mr Bachchan Movie Shoot Photo goes Viral
Harish Shankar – Bhagyashri Borse : హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా మిస్టర్ బచ్చన్. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మిస్టర్ బచ్చన్ సినిమాతో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే తెలుగులో పరిచయం అవుతుంది. ఇప్పటికే సాంగ్స్ లో తన స్టెప్పులతో, ఈవెంట్స్ లో తన మాటలతో, తన అందంతో భాగ్యశ్రీ బోర్సే తెలుగులో అభిమానులను సంపాదించుకుంది.
తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీ యూనిట్ అంతా కలిసి సెలబ్రేషన్స్ చేసుకోగా సినిమా షూట్ లో జరిగిన జ్ఞాపకాలని కూడా పంచుకున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే వెనకాల డైరెక్టర్ హరీష్ శంకర్ నడుస్తున్న ఓ ఫోటోని అక్కడ తెరపై వేశారు. ఈ ఫొటోలో హీరోయిన్ వెనకాల సరదాగా అల్లరిగా డైరెక్టర్ పడినట్టు ఉంది. కానీ ఇది సినిమాలో హీరోకి సీన్ గురించి చెప్పే సీన్. రవితేజ ఎలా చేయాలో హరీష్ శంకర్ ఆ సీన్ లో చూపిస్తుండగా తీసిన ఫోటో ఇలా మూవీ టీమ్ సెలబ్రేషన్స్ లో చూపించారు.
Also Read : Raviteja – Siddhu : రవితేజ సినిమాలో డీజే టిల్లు నిజమే అంట.. ఫైట్ సీన్ లో..?
అయితే ఈ ఫోటోకి హరీష్ శంకర్ సమాధానమిస్తూ.. ప్రతి అమ్మాయి విజయం వెనక కూడా ఒక అబ్బాయి ఉంటాడు. అలాగే భాగ్యశ్రీ సక్సెస్ వెనక నేను ఉంటాను అని ఆ ఫోటో అర్ధం చెప్పాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#bhagyashriborse సక్సెస్ వెనుక నేనున్నాను – @harish2you
Photo Back Story ?#MrBachchanOnAug15th pic.twitter.com/QETwC0EfYd
— Rajesh Manne (@rajeshmanne1) August 6, 2024