Raviteja – Siddhu : రవితేజ సినిమాలో డీజే టిల్లు నిజమే అంట.. ఫైట్ సీన్ లో..?
ఇప్పటికే మిస్టర్ బచ్చన్ సినిమాపై మంచి కమర్షియల్ సినిమా అని అంచనాలు ఉన్నాయి.

Siddhu Jonnalagadda will Play Key Role in Raviteja Mr Bachchan Movie Rumours goes Viral
Raviteja – Siddhu Jonnalagadda : హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా మిస్టర్ బచ్చన్. ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. బాలీవుడ్ రైడ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే మిస్టర్ బచ్చన్ సినిమాపై మంచి కమర్షియల్ సినిమా అని అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మిస్టర్ బచ్చన్ సినిమాలో డీజే టిల్లు హీరో సిద్ధూ జొన్నలగడ్డ గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలు నిజం అవ్వొచ్చు అని టాలీవుడ్ టాక్.
Also Read : Ileana Son : అప్పుడే ఇలియానా కొడుకు ఫస్ట్ బర్త్‌డే.. ఫోటోలు వైరల్..
మిస్టర్ బచ్చన్ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ఫైట్ సీన్ లో దాదాపు 2 నిముషాలు సిద్ధూ జొన్నలగడ్డ కనిపిస్తాడని, సిద్ధూ ఎంట్రీ అదిరిపోతుందని తాజా సమాచారం. అయితే దీనిపై మూవీ యూనిట్ కానీ, సిద్ధూ కానీ స్పందించలేదు. మరి నిజంగానే రవితేజ సినిమాలో సిద్ధూ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడా తెలియాలంటే ఆగస్టు 15 దాకా చూడాల్సిందే.