Ileana Son : అప్పుడే ఇలియానా కొడుకు ఫస్ట్ బర్త్‌డే.. ఫోటోలు వైరల్..

తాజాగా ఇలియానా తన కొడుకు మొదటి పుట్టిన రోజు వేడులని ఇంట్లోనే సింపుల్ గా సెలబ్రేట్ చేసింది.

Ileana Son : అప్పుడే ఇలియానా కొడుకు ఫస్ట్ బర్త్‌డే.. ఫోటోలు వైరల్..

Ileana D'Cruz shares her Son First Birthday Photos

Updated On : August 7, 2024 / 7:28 AM IST

Ileana D’Cruz Son : ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా కరోనా సమయం నుంచి సినిమాలు తగ్గించేసింది. విదేశాలకు చెందిన మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని ఇలియానా పెళ్లి చేసుకొని గత సంవత్సరం ఒక బాబుకి జన్మనిచ్చింది. బాబు పుట్టేదాకా భర్తని అజ్ఞాతంలోనే ఉంచిన ఇలియానా ఆ తర్వాత అప్పుడప్పుడు భర్తతో కలిసి దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

Also Read : Pawan Kalyan – Harish Shankar : మొన్నే పవన్ గారిని కలిశారు.. త్వరలో షూటింగ్స్.. ఆ రెండు సినిమాలు అయ్యాకే నాది..

ఇక బాబు పుట్టాక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయి తన బాబు ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తుంది ఇలియానా. తన బాబుకి ఫీనిక్స్ డోలన్ అనే పేరు పెట్టింది. తాజాగా ఇలియానా తన కొడుకు మొదటి పుట్టిన రోజు వేడులని ఇంట్లోనే సింపుల్ గా సెలబ్రేట్ చేసింది. పుట్టిన రోజు వేడుకల్లో తీసిన తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే తన భర్త, కొడుకుతో కలిసి ఉన్న క్యూట్ ఫోటోని కూడా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Ileana D'Cruz shares her Son First Birthday Photos

దీంతో ఇలియానా తనయుడికి పుట్టిన రోజు విషెష్ చెప్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్స్. ఇలియానా మళ్ళీ సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందో అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.