Apple iPhone 14 Price : ఇమాజిన్ మాన్‌సూన్ ఫెస్ట్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్.. ధర ఎంత తగ్గిందంటే?

Apple iPhone 14 Price : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 14 మోడల్ 128జీబీ వేరియంట్ ధర రూ. 79,900కు అందిస్తోంది. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ధర రూ. 69,900 తగ్గింపు అందిస్తోంది.

iPhone 14 at an Effective Price of Rs. 34,900 With Exchange Offer ( Image Source : Google )

Apple iPhone 14 Price : ఆపిల్ కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో ఐఫోన్ 14 సేల్ మొదలైంది. ఐఫోన్ 14 మొదట సెప్టెంబర్ 2022లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌తో పాటుగా వస్తుంది.

Read Also : Ola Maps Services : గూగుల్ మ్యాప్స్‌కు గుడ్‌బై.. ఇకపై ఓలా సొంత మ్యాప్స్‌‌‌తోనే నేవిగేషన్..!

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధరలు దేశంలో లాంచ్ అయినప్పటి నుంచి తగ్గింపు పొందాయి. ఇప్పుడు, ఆపిల్ రీసెల్లర్ ఇమాజిన్ నిర్వహిస్తున్న మాన్‌సూన్ ఫెస్ట్ సేల్‌లో వనిల్లా ఐఫోన్ 14 హ్యాండ్‌సెట్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు ధర ఐఫోన్ 14 అధికారిక సైట్ లేదా ఇ-కామర్స్ సైట్‌లలో లిస్టు చేసిన ధర కన్నా చాలా తక్కువగా ఉంటుంది.

భారత్‌లో ఐఫోన్ 14 ధర, ఆఫర్లు వివరాలివే :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 14 మోడల్ 128జీబీ వేరియంట్ ధర రూ. 79,900కు అందిస్తోంది. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ధర రూ. 69,900 తగ్గింపు అందిస్తోంది. ఆపిల్ రీసేల్ సంస్థ ఇమాజిన్ ఐఫోన్ 14 అదే ఆప్షన్‌తో మాన్‌సూన్ ఫెస్ట్ సేల్‌లో రూ. 34,900 ధరకు కొనుగోలు చేయవచ్చునని ధృవీకరించింది. అయితే, ఇది ఫ్లాట్ డిస్కౌంట్ కాదు. షరతులతో కూడిన ఆఫర్లు ఉన్నాయి.

ఐఫోన్ 14 కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 69,900 ధరకు కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఇమాజిన్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ. 6వేలు పొందవచ్చు. ఇన్‌స్టంట్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ రూ. 3వేల వరకు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను రూ.20వేల వరకు ఎక్స్ఛేంజ్ విలువతో కూడా మార్చుకోవచ్చు.

అదనంగా రూ. 6వేల ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ పొందవచ్చు. ఈ తగ్గింపులు నికర ధరను రూ. 34,900కు పొందవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ చేసుకోగలిగేతే ఇప్పటికీ రూ. 9వేల డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా రూ. 60వేల వరకు ధర తగ్గుతుంది. అధికారిక ఆపిల్ ఇ-స్టోర్ ద్వారా లిస్టు చేసిన ధర కన్నా తక్కువగా ఉంటుంది.

ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 14 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆపిల్ ఎ15 బయోనిక్ ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఐఫోన్ ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 12ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 12ఎంపీ సెల్ఫీ షూటర్‌ను అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 26 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

Read Also : Ambani Sangeet Ceremony : అనంత్ అంబానీ సంగీత్ వేడుకలో ముంబై క్రికెటర్ల సందడి.. ప్రపంచ కప్ విజేతలపై నీతా అంబానీ ప్రశంసల వర్షం..!

ట్రెండింగ్ వార్తలు