కవితకు అనారోగ్యం.. తీహార్ జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు

తీహార్ జైలు వైద్యుల సూచన మేరకు దీన్ దయాళ్ ప్రభుత్వ ఆసుపత్రికి కవితను తరలించారు జైలు అధికారులు.

Mlc Kavitha Sick : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కవితను చికిత్స నిమిత్తం తీహార్ జైలు నుంచి దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవిత.. 4 నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15న, సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్ట్ అయ్యారు. 100 రోజులకు పైగా తీహార్ జైలులో ఉన్నారు. ఎండ వేడిమి, ఉక్కపోతతో కవిత అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

గత రెండు రోజుల నుండి హై ఫీవర్ తో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం నీరసం కారణంగా కళ్లు తిరిగి కవిత పడిపోయారు. తీహార్ జైలు వైద్యుల సూచన మేరకు కవితను దీన్ దయాళ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స అనంతరం కవిత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు, కవిత అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే కేటీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

Also Read : సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. కేసీఆర్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

 

ట్రెండింగ్ వార్తలు