Ambani Sangeet Ceremony : అనంత్ అంబానీ సంగీత్ వేడుకలో ముంబై క్రికెటర్ల సందడి.. ప్రపంచ కప్ విజేతలపై నీతా అంబానీ ప్రశంసల వర్షం..!

Ambani Sangeet Ceremony : టీ20 ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ముగ్గురిపై అంబానీ ఫ్యామిలీ ప్రశంసల వర్షం కురిపించింది.

T20 World Cup-Winning Team Rohit Sharma, Hardik Pandya And Suryakumar Yadav in Ambani Sangeet Ceremony ( Image Source : Google )

Ambani Sangeet Ceremony : ప్రముఖ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట్లో శుక్రవారం (జూలై 5) రాత్రి ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో ముంబై ఇండియన్స్ క్రికెటర్లు సందడి చేశారు. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో అద్భుతమైన ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

టీ20 ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ముగ్గురిపై అంబానీ ఫ్యామిలీ ప్రశంసల వర్షం కురిపించింది. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్ కోసం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ ముగ్గురికి గుమ్మడికాయపై కర్పూరం వెలిగించి దిష్టితీశారు.

Read Also : లావణ్యపై హీరోయిన్ మాల్వీ ఫిర్యాదు.. రాజ్ తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్న నటి

ఆ తర్వాత నీతా అంబానీతో కలిసి అమ్మవారి దగ్గర క్రికెటర్లు ఆశీర్వాదం తీసుకుని హారతి అందుకున్నారు. అనంతరం క్రికెటర్లను స్టేజ్​పై పిలిచి ఫైనల్​ మ్యాచ్​లో వారి ప్రదర్శనపై నీతా అంబానీ పొగడ్తలతో ముంచెత్తారు. బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అవుతున్న ’83’ సినిమాలోని ‘లెహ్రా దో’ అనే ఐకానిక్ సాంగ్‌తో వరల్డ్ కప్ హీరోలను నీతా అంబానీ వీఐపీలలా వేదికపైకి ఆహ్వానించారు. ఈ ముగ్గురు క్రికెటర్లు ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో భాగమైనందున టీ20 ప్రపంచ కప్ విజయం తనకు వ్యక్తిగతంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నీతా తెలిపారు.

ముంబై క్రికెటర్లను ప్రత్యేకంగా ఆమె అభినందించారు. రోహిత్‌, సూర్యకుమార్‌, పాండ్యా స్టెప్పులేయడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టు విజయాన్ని చేజిక్కించుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ తెలిపారు.

చివరి ఓవర్ బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యాను నీతా అంబానీ ప్రశంసిస్తూ.. “కఠినమైన సమయం ఉండదు.. కానీ కఠినమైన వ్యక్తులు చేస్తారు’’ అంటూ ఇటీవల అతనిపై వచ్చిన విమర్శలను ఉద్దేశించి మాట్లాడారు. భారత్ గర్వపడేలా చేసినందుకు క్రికెటర్లను అభినందిస్తూ ముఖేష్ అంబానీ కూడా ఆనందం వ్యక్తం చేశారు.

2011లో ప్రపంచకప్‌లో విజయం సాధించిన టీమిండియా నాటి రోజులను ఈ సందర్భంగా అంబానీ ఫ్యామిలీ గుర్తు చేసుకుంది. మరో టీ20 ప్రపంచకప్ విజేత, ముంబై ఇండియన్స్ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సంగీత్ వేడుకకు హాజరైన వారంతా వరల్డ్ కప్ విన్నింగ్ క్రికెటర్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ముంబై క్రికెటర్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇతర భారత క్రికెటర్లలో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కృనాల్ పాండ్యా, కేఎల్ రాహుల్, లెజెండరీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో జరిగిన అనంత్, రాధికల సంగీత వేడుకలో క్రికెటర్లతో పాటు, సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.

Read Also : IND vs ZIM 1st T20: తొలి టీ20లో జింబాబ్వే చేతిలో ఓడిపోయిన టీమిండియా

ట్రెండింగ్ వార్తలు