టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో పాటు పలువురిపై ఆరోపణలు చేసిన లావణ్యపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. అలాగే, లావణ్య చేసిన ఆరోపణలపై మాల్వీ స్పందించింది. తాను లావణ్యను బెదిరించలేదని మాల్వీ చెప్పింది.
రాజ్ తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని మాల్వీ చెప్పింది. రాజ్ తరుణ్ కేవలం తన సహనటుడు మాత్రమేనని తెలిపింది. అలాగే, లావణ్యతో తనకు ఎలాంటి పరిచయమూ లేదని చెప్పింది. రాజ్ తరుణ్ తో నటించే ప్రతి హీరోయిన్ నూ లావణ్య అనుమానిస్తోందని తెలిపింది. అసలు షూటింగ్ పూర్తయ్యాక రాజ్ తరుణ్ తో తాను టచ్ లో లేనని చెప్పింది.
కాగా, మాల్వీ మల్హోత్రా కుటుంబం నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఇప్పటికే నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మాల్వీ కారణంగానే రాజ్ తరుణ్ తనకు దూరం అయ్యాడని లావణ్య ఆరోపణలు చేసింది. మాల్వీ కుటుంబ సభ్యులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
రాజ్ తరుణ్ తనతో ప్రేమాయణం కొనసాగించి తనను మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం అలజడి రేపుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే రాజ్ తరుణ్ సమాధానమిచ్చాడు.
Also Read: హమ్మయ్యా.. మంచు లక్ష్మి కష్టం తీరిపోయిందిగా.. ఆనందంలో మోహన్ బాబు కూతురు