Manchu Lakshmi : హ‌మ్మ‌య్యా.. మంచు ల‌క్ష్మి కష్టం తీరిపోయిందిగా.. ఆనందంలో మోహ‌న్ బాబు కూతురు

సీనియ‌ర్ న‌టుడు మోహన్ బాబు వారసురాలిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది మంచు లక్ష్మి.

Manchu Lakshmi : హ‌మ్మ‌య్యా.. మంచు ల‌క్ష్మి కష్టం తీరిపోయిందిగా.. ఆనందంలో మోహ‌న్ బాబు కూతురు

Passport vochindhi oooch Manchu Lakshmi post viral

Updated On : July 6, 2024 / 5:11 PM IST

సీనియ‌ర్ న‌టుడు మోహన్ బాబు వారసురాలిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది మంచు లక్ష్మి. త‌న న‌ట‌న‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, టీవీ షో హోస్ట్‌గా, నిర్మాతగా విజ‌యాల‌ను అందుకుంది. నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను అభిమాల‌తో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవ‌ల ఆమె త‌న‌కు సాయం చేయాల‌ని నెటిజ‌న్ల‌ను అభ్య‌ర్థిచ‌గా.. ఇప్పుడు స‌మ‌స్య ప‌రిష్కారమైంది అంటూ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.

అస‌లేం జ‌రిగిందంటే..?

‘అమెరికా సిటిజన్‌ అయిన నా కుమార్తె స్కూల్‌ హాలీడేస్‌ త్వరలోనే ముగియనున్నాయి. ఈ నెల 12న మేం అక్కడకు వెళ్లాల్సి ఉంది. ఎంబసీ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. వారిని సంప్రదించేందుకు మార్గం లేకుండా పోయింది. వీసా జారీ అయి నెలకుపైనే అయినా దాన్ని చేరవేయడంలో జాప్యం చోటుచేసుకుంది. ఎవరైనా హెల్ప్‌ చేయగలరా?.’ అని రెండు రోజుల క్రితం మంచు ల‌క్ష్మి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజ‌న్లు స్పందించారు. త‌మ‌కు తెలిసిన స‌మాచారాన్ని చెప్పారు.

Sai Rajesh : బేబీ ద‌ర్శ‌కుడు సాయి రాజేశ్‌కు వ‌చ్చిన క‌ష్టం పగోడికి కూడా రాకూడ‌దు.. భోజనానికి పిలిచి..

తాజాగా పాస్‌పోర్టు వ‌చ్చిన‌ట్లు మంచి ల‌క్ష్మి తెలియ‌జేసింది. ‘ఆఖ‌రి పాస్ పోర్టు వ‌చ్చేసింది. సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ ఒత్తిడితో కూడిన సమయంలో ప్రేమ, మద్దతు వెల‌క‌ట్ట‌లేనిది. మీ ప్రేమ‌కి కృత‌జ్ఞ‌త‌లు.’ అంటూ మంచు ల‌క్ష్మి అంది.

Swapna Varma : టాలీవుడ్‌లో విషాదం.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మ‌హ‌త్య‌..