Swapna Varma : టాలీవుడ్‌లో విషాదం.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య..
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది.

Swapna Varma (File Photo)
Swapna Varma : టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ(33) ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్‌లో తాను నివాసం ఉంటున్న ప్లాట్‌లో బలవన్మరణానికి పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఆమె ఈ పని చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
స్వప్న వర్మ సొంతూరు రాజమండ్రి. సినీ రంగంలో పనిచేసేందుకు మూడు సంవత్సరాల క్రితం ఆమె హైదరాబాద్ నగరానికి వచ్చింది. గత సంవత్సరం నుంచి మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో నివాసం ఉంటూ సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తోంది. అయితే.. గత ఆరు నెలలగా ఆమెకు ఎలాంటి ప్రాజెక్టులు లేవు. దీంతో ఆమె ఖాళీగా ఉంటుంది. రెండు రోజు క్రితం తన ప్లాట్‌లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read: కల్కి సినిమా పార్ట్ 2 గురించి నాగ్ అశ్విన్ చెప్పిన బోలెడన్ని విషయాలు ఇవే..
ఆమె ప్లాట్‌నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకి చేరుకుని ప్లాట్ తలుపులు పగలకొట్టి చూడగా ఉరివేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.