Kalki Part 2 – Nag Ashwin : కల్కి సినిమా పార్ట్ 2 గురించి నాగ్ అశ్విన్ చెప్పిన బోలెడన్ని విషయాలు ఇవే..

కల్కి పార్ట్ 2 గురించి నాగ్ అశ్విన్ చెప్పిన విషయాలు ఇవే..

Kalki Part 2 – Nag Ashwin : కల్కి సినిమా పార్ట్ 2 గురించి నాగ్ అశ్విన్ చెప్పిన బోలెడన్ని విషయాలు ఇవే..

Nag Ashwin Interesting Comments on Kalki 2898AD Movie Part 2

Kalki Part 2 – Nag Ashwin : ప్రభాస్ కల్కి సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అనేక రికార్డులని సృష్టించింది కల్కి సినిమా. ఇక ఈ సినిమాలో అనేకమంది స్టార్ యాక్టర్స్ తో నటించడం కాక చాలా మంది స్టార్స్ గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇచ్చారు. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉందని ప్రకటించడంతో ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో కల్కి పార్ట్ 2 ఏ రేంజ్ లో ఉంటుందో అని అంచనాలు వేసుకుంటున్నారు ప్రేక్షకులు.

తాజాగా కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ కల్కి పార్ట్ 2 గురించి బోలెడన్ని విషయాలు తెలిపారు.

కల్కి పార్ట్ 2 గురించి నాగ్ అశ్విన్ చెప్పిన విషయాలు ఇవే..

#విజయ్ దేవరకొండ అర్జున పాత్ర గెస్ట్ రోల్ కాదు, సెకండ్ పార్ట్ లో కూడా ఉంటుంది.
#నెక్స్ట్ పార్ట్ లో నాని, నవీన్ పోలిశెట్టి కూడా గెస్ట్ పాత్రల్లో కనిపించొచ్చు.
#దుల్కర్ సల్మాన్ పాత్ర సెకండ్ హాఫ్ లో ఉంటుంది.
#సెకండ్ పార్ట్ లో ప్రభాస్ పాత్ర ఫుల్ లెంగ్త్ ఉంటుంది.
#కమల్ హాసన్ గారి అసలు రూపం పార్ట్ 2 లో చూస్తారు.
#ఇంకా చాలా మంది కొత్త యాక్టర్స్ పార్ట్ 2లో కనిపిస్తారు.
#ఇప్పటివరకు పార్ట్ 2 కేవలం 30 రోజులు షూట్ మాత్రమే పూర్తయింది.
#పార్ట్ 2కి ఇంకా చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయాలి.
#కల్కి పార్ట్ 2 లో మూడు ప్రపంచాలు కాకుండా ఇంకో ప్రపంచం కూడా ఉంటుంది.
#పార్ట్ 2లో కూడా కృష్ణుడు ఉంటాడు. కానీ ఫేస్ రివీల్ చేయకుండా పార్ట్ 1లో ఉన్నట్టే ఉంటుంది.
#ఈ సినిమాలో మరియం, కైరా, సుప్రీమ్ యాస్కిన్.. ఇలా అనేక పాత్రలపై సపరేట్ సినిమాలు కూడా చేసే ఛాన్స్ ఉంది కానీ చేయకపోవచ్చు.