Brian Lara : బ్రియాన్ లారా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. నేను, స‌చిన్ కూడా ఆ ప్లేయ‌ర్ ప్ర‌తిభ‌కు ద‌గ్గ‌ర‌గా రాలేదు..

క్రికెట్‌లో ఆల్‌టైమ్ అత్యుత్త‌మ బ్యాట‌ర్ల‌లో టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్‌, వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారాలు ఖ‌చ్చితంగా ఉంటారు.

Brian Lara Names Most Talented Player Of All Time

Brian Lara – Sachin Tendulkar : క్రికెట్‌లో ఆల్‌టైమ్ అత్యుత్త‌మ బ్యాట‌ర్ల‌లో టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్‌, వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారాలు ఖ‌చ్చితంగా ఉంటారు. వీరిద్ద‌రు క్రికెట్ ఆడే రోజుల్లో ఎన్నో రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టారు. టెస్టుల్లో(15,921), వ‌న్డేల్లో (18,426) అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు ఇప్ప‌టికి స‌చిన్ పేరిటే ఉంది. మ‌రోవైపు టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక స్కోరు (400) తో పాటు ఫ‌స్ల్ క్లాస్ క్రికెట్‌లో (500) అత్య‌ధిక స్కోరు చేసిన బ్యాట‌ర్‌గా లారా కొన‌సాగుతున్నాడు. ఇక స‌చిన్ ఆట అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని చాలా సంద‌ర్భాల్లో లారా చెప్పాడు.

తాజాగా లారా అసాధార‌ణ ప్ర‌తిభ గురించి చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. తన మాజీ సహచరుడు కార్ల్ హూపర్ యొక్క సహజ సామర్థ్యాలపై లారా తన అభిమానాన్ని తెలిపాడు. తాను, టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ లు హూప‌ర్ యొక్క స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్ర‌తిభ‌కు స‌రిపోలేమ‌ని అన్నాడు.

Rohit Sharma : ఓరీ నాయ‌నో.. ఎంత చ‌క్క‌గా రోహిత్ శ‌ర్మ తెలుగులో మాట్లాడారో చూశారా..?

‘నేను చూసిన అత్యుత్తమ ఆటగాళ్ళలో కార్ల్ ఒకడు. టెండూల్కర్, నేను కూడా అత‌డి ప్రతిభకు దగ్గరగా రాలేమ‌ని చెబుతాను. కార్ల్ కెరీర్‌ను గ‌మ‌నిస్తే.. సాధార‌ణ ఆట‌గాడి నుంచి కెప్టెన్‌గా అత‌డి సంఖ్య‌లు చాలా భిన్నంగా ఉంటాయి. కెప్టెన్‌గా అత‌డు స‌గ‌టు 50కి ద‌గ్గ‌ర‌గా ఉంది. అత‌డు బాధ్య‌త‌ల‌ను ఎంతో చ‌క్క‌గా నిర్వ‌ర్తిస్తాడు. అయితే.. కెప్టెన్‌గా మాత్ర‌మే అత‌డు త‌న‌లోని అత్యుత్త‌మ ఆట‌ను బ‌య‌టికి తీయ‌డం విచార‌క‌రం.’ అని లారా అన్నాడు. దిగ్గజ వెస్టిండీస్ బ్యాటర్ వివియన్ రిచర్డ్స్‌కు హూపర్‌పై ప్రత్యేక అభిమానం ఉందని లారా పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఓ సంద‌ర్భంలో టెస్టుల్లో త‌న అత్య‌ధిక స్కోరు బ‌ద్ద‌లు కొట్ట‌గ‌ల సామ‌ర్థ్యం ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఎవ‌రికి ఉంది అనే ప్ర‌శ్న లారాకు ఎదురైంది. తాను క్రికెట్ ఆడే రోజుల్లో త‌న‌కు స‌వాల్ విసిరిన లేదా క‌నీసం 300 మార్కును దాటిన ఆట‌గాళ్లు వీరేంద్ర సెహ్వాగ్ , క్రిస్ గేల్ , ఇంజమామ్-ఉల్-హక్, సనత్ జయసూర్య అని చెప్పాడు. వీరంతా దూకుడుగా ఆడే వాళ్ల‌ని అన్నాడు. ప్ర‌స్తుతం చాలా మంది దూకుడుగా ఆడుతున్నాడ‌ని, ముఖ్యంగా ఇంగ్లాండ్ జ‌ట్టులో జాక్ క్రాలీ, హ్యారీ బ్రూక్‌, టీమ్ఇండియాలో య‌శ‌స్వి జైస్వాల్, శుభ్‌మ‌న్ గిల్‌ల‌కు ఆ సామ‌ర్థ్యం ఉంద‌న్నాడు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ మాట్లాడుతుండ‌గా.. మిచెల్ స్టార్క్‌అంటూ నినాదాలు.. హిట్‌మ్యాన్ ఏమ‌న్నాడంటే..?

ట్రెండింగ్ వార్తలు