Virat Kohli – Amit Mishra : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లిపై టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ అయ్యాక కోహ్లి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందన్నాడు. ఆటగాళ్ల స్నేహానికి దూరమయ్యాడని చెప్పాడు. అయితే.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఎంత ఎదిగినా సరే.. ఆటగాడిగా తొలి రోజు ఎలాగ ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడని అన్నాడు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ మిశ్రా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, కోహ్లితో తన అనుబంధం ఎలా ఉందనే విషయాన్ని వెల్లడించాడు. కోహ్లి, రోహిత్‌లలో ఎవరు బెస్టు, జట్టులో ఎవరికి ఎక్కువ స్నేహితులు ఉంటారు అనే ప్రశ్న మిశ్రాకు ఎదురుకాగా ఇలా సమాధానం ఇచ్చాడు. తాను అబద్ధం చెప్పడం లేదన్నాడు. ఓ క్రికెట్‌ర్‌గా కోహ్లి అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పాడు.
ఏజ్ క్రికెట్ నుంచి కోహ్లితో ఆడుతున్నానని, తనకు అతడి ఫోన్ నెంబర్ కూడా తెలియదన్నాడు. కెప్టెన్ అయిన తరువాత కోహ్లి ఎంతో మారిపోయాడని చెప్పాడు. అందుకనే జట్టులో కోహ్లికి ఎక్కువ మంది స్నేహితులు లేరని అన్నాడు. ప్రస్తుతం కోహ్లితో గతంలో తాను ఉన్నట్లుగా ఉండడం లేదన్నాడు. దాదాపుగా ఇద్దరం మాట్లాడుకోవడం లేదన్నాడు. పేరు ప్రఖ్యాతలు, డబ్బు వచ్చింది కాబట్టి ఎవరైనా ఏదో ప్రయోజనం ఆశించి వస్తారని కొంత మంది భావిస్తారని, కానీ తాను మాత్రం అలాంటి వాడిని కాదన్నాడు.
ఇక రోహిత్ శర్మలో నచ్చే అంశం ఏంటి అని అంటే.. తాను మొదటి సారి అతడిని కలిసినప్పుడు ఎలా ఉన్నాడో ప్రస్తుతం కూడా అలాగే ఉన్నాడని అన్నాడు. ఏదైనా సందర్భంలో లేదా ఐపీఎల్ సమయంలో కలిసినా కూడా రోహిత్ చాలా సరదాగా మాట్లాడుతాడని చెప్పాడు. ఒకరిపై ఒకరం జోక్స్ కూడా వేసుకుంటామన్నాడు. కెప్టెన్ అయినా కూడా ఎంతో స్నేహాంగా ఉంటాడని తెలిపాడు. అతడు ప్రపంచంలోనే బెస్ట్ కెప్టెన్, ప్రపంచకప్ విజేత, ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధించాక కూడా.. అని మిశ్రా అన్నాడు.
Rohit Sharma : ఓరీ నాయనో.. ఎంత చక్కగా రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడారో చూశారా..?
టీమ్ఇండియా తరుపున అమిత్ మిశ్రా.. 22 టెస్ట్‌లు, 33 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 76, వన్డేల్లో 64, టీ20ల్లో 16 వికెట్లు తీశాడు.
‘Fame And Power Changed Virat Kohli’: Veteran India Star’s ( Amir Mishra) Explosive Remark. #ViratKohli #AmitMishra pic.twitter.com/0sDoenWZLr
— Shubhankar Mishra (@shubhankrmishra) July 15, 2024