JioAirFiber Offer : జియోటీవీ+ టూ-ఇన్-వన్ ఆఫర్ : ఒకే కనెక్షన్‌తో రెండు టీవీల్లో కంటెంట్ చూడొచ్చు!

JioAirFiber Offer : ఈ సర్వీసు అన్ని జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌లతో అందుబాటులో ఉంది. జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌ల కోసం రూ.599, రూ.899 అంతకంటే ఎక్కువ ప్లాన్‌లలో అందిస్తోంది.

JioTV Plus 2 in 1 Offer _ Connect 2 TVs with 1 JioAirFiber connection ( Image Source : Google )

JioAirFiber Offer : రిలయన్స్ జియో యూజర్లకు అదిరే ఆఫర్.. “జియో టీవీ ప్లస్ టూ-ఇన్-వన్” అనే సరికొత్తగా ఆఫర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ వినూత్న ఆఫర్ ద్వారా కస్టమర్‌లు ఒకే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ ద్వారా ఒకేసారి రెండు టెలివిజన్‌లతో కనెక్ట్ అవ్వొచ్చు. ఈ ప్లాన్‌తో జియో టీవీ ప్లస్ యాప్ ద్వారా సబ్‌స్క్రైబర్‌లు, 800కి పైగా డిజిటల్ టీవీ ఛానెల్‌లు, 13 ప్రముఖ ఓటీటీయాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు.

Read Also : Tesla Train Robot : టెస్లా రోబో ట్రైనింగ్ కోసం.. ఈ సూట్‌లో 7 గంటలు నడిస్తే చాలు.. రోజుకు రూ. 28వేల వరకు చెల్లిస్తుంది..!

జియోటీవీ యాప్ విభిన్న రకాల కంటెంట్‌ను అందిస్తుంది. 10 భాషలు, 20 కేటగిరీల్లో 800 కన్నా ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లను అందిస్తోంది. ఈ మెగా ఛానెల్ లైనప్‌, వినియోగదారులు ఒకే లాగిన్ నుంచి 13కి పైగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు.

జియోటీవీ+ టాప్ ఫీచర్లు :

  •  సింగిల్ సైన్-ఆన్ : మల్టీ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సస్
  •  స్మార్ట్ టీవీ రిమోట్ సపోర్టు : నావిగేషన్, కంట్రోలింగ్
  •  కస్టమైజడ్ కంటెంట్ : వ్యూ ప్రాధాన్యతల ఆధారంగా టైలర్స్ సిఫార్సులు.
  •  స్మార్ట్ ఫిల్టర్‌లు : సులభంగా సెర్చ్, ఛానెల్ ఆవిష్కరణ
  •  ప్లేబ్యాక్ కంట్రోలింగ్ : ప్లేబ్యాక్ స్పీడ్ ఎడ్జెస్ట్, ఎగ్జిస్ట్ షోలు

ఈ సర్వీసు అన్ని జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌లతో అందుబాటులో ఉంది. జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌ల కోసం రూ.599, రూ.899 అంతకంటే ఎక్కువ ప్లాన్‌లలో అందిస్తోంది. జియోఫైబర్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఈ సర్వీసు రూ.999, అంతకంటే ఎక్కువ ప్లాన్‌లలో అందుబాటులో ఉంది. జియోటీవీ+ యాప్ ద్వారా అందించే అనేక ఛానెల్‌లు, ఓటీటీ యాప్‌లలో కలర్స్ టీవీ, స్టార్ ప్లస్, జీ టీవీ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. అదనంగా, డిస్నీ ప్లస్+ హాట్‌స్టార్, సోనీలైవ్, జీ5 వంటి టాప్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది.

ఈ ఆఫర్ పొందడానికి మీ స్మార్ట్‌టీవీ యాప్ స్టోర్ నుంచి జియో టీవీ ప్లస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. మీ రిజిస్టర్డ్ జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి. వెంటనే విస్తారమైన కంటెంట్ లైబ్రరీని పొందండి. ఈ ఆఫర్‌తో జియో టీవీ భారత అతిపెద్ద కంటెంట్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌గా వేగంగా మారుతోంది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేదా ప్రత్యేక కనెక్షన్‌ల అవసరం లేకుండా విభిన్న రకాల ఎంటర్‌టైన్మెంట్ ఆప్షన్లను యాక్సెస్‌ను అందిస్తుంది.

అర్హత గల ప్లాన్‌లు :
1. జియోఎయిర్ ఫైబర్ అన్ని ప్లాన్‌లు
2. జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ : రూ. 599, రూ. 899 అంతకంటే ఎక్కువ
3. జియోఫైబర్ ప్రీపెయిడ్ : 999 లేదా అంతకంటే ఎక్కువ

జియోటీవీ ప్లస్ ఎలా యాక్సెస్ చేయాలి? :
1. ఆండ్రాయిడ్ టీవీ, ఆపిల్ టీవీ లేదా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ యాప్‌స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.
ఎ. జియోటీవీ+ యాప్
బి. హాట్ స్టార్, జీ5, సోనీలైవ్, సన్‌నెక్స్ట్ అప్లికేషన్
2. లాగిన్
ఎ. మీ జియోఫైబర్/జియోఎయిర్ ఫైబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో జియోటీవీ ప్లస్ యాప్‌లోకి
బి. ఓటీపీతో అథెంటికేషన్ చేయండి.
3. జియోటీవీ ప్లస్ యాప్‌ని ఎనేబుల్ చేయండి.

డౌన్‌లోడ్, లాగిన్ చేయడం ఎలా? :
* మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ రిమోట్ / ఫైర్ స్టిక్ రిమోట్ / ఆపిల్ టీవీ రిమోట్ ఉపయోగించండి.
* మీ స్మార్ట్ టీవీ యాప్‌స్టోర్ లేదా ప్లేస్టోర్‌లో, జియోటీవీ కోసం సెర్చ్ చేయండి. జియోటీవీ ప్లస్‌పై క్లిక్ చేయండి.
* మీ టీవీలో దీన్ని ఇన్‌స్టాల్ చేయడానికి జియోటీవీ ప్లస్ యాప్‌ని క్లిక్ చేయండి.

Read Also : Xiaomi X Pro Smart TV : కొత్త స్మార్ట్‌టీవీ వచ్చేస్తోంది.. ఈ నెల 27నే లాంచ్.. సూపర్ ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు