Viral Video: ఇదెక్కడి డ్యాన్స్.. వర్షంలో తడుస్తూ నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన మహిళ

. వెనుక నుంచి ఇతర వాహనాలు వస్తున్నప్పటికీ, అందరూ ఆమెను చూస్తున్నప్పటికీ ఏ మాత్రం సిగ్గు పడకుండా ఎగురుతూ..

సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికి ఎంతకైనా తెగిస్తామనేలా ప్రవర్తిస్తున్నారు కొందరు. నడిరోడ్డుపై ఇష్టం వచ్చినట్లు ప్రవరిస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇటువంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరొకటి చోటుచేసుకుంది.

వర్షంలో తడుస్తూ నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిందో మహిళ.. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ మహిళ నడిరోడ్డుపై చేసిన రిస్కీ ఫీట్‌పై విమర్శల జల్లు కురుస్తోంది. మొదట కారు నుంచి దిగిన ఆ మహిళ ఆ తర్వాత ఆ వాహనం ఎక్కింది. కారు నుంచి కిందకు దూకి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. వెనుక నుంచి ఇతర వాహనాలు వస్తున్నప్పటికీ, అందరూ ఆమెను చూస్తున్నప్పటికీ ఏ మాత్రం సిగ్గు పడకుండా ఎగురుతూ డ్యాన్స్ చేసింది.

వర్షంలో అందరూ ఎన్నో ఇబ్బందులు పడుతూ వెళ్తుంటే.. ఈ మహిళ మాత్రం వర్షంలో హాయిగా ఎంజాయ్ చేస్తూ అందరి కంటే భిన్నంగా వ్యవహరించింది. ఇటువంటి డ్యాన్సును తాము ఎన్నడూ చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. డ్యాన్స్ చేయడానికి మీకు రోడ్డే దొరికిందా అని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఓ నెటిజన్ షేర్ చేసిన ఈ వీడియోపై స్పందించిన ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఆమె కారు నంబరును పంపాలని కోరారు. ఆమెపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

Also Read: వామ్మో.. చోరీలు, దోపిడీలు నేర్పించే స్కూల్.. అడ్మిషన్ ఫీజు రూ.3 లక్షలు..

ట్రెండింగ్ వార్తలు