Tesla Train Robot : టెస్లా రోబో ట్రైనింగ్ కోసం.. ఈ సూట్‌లో 7 గంటలు నడిస్తే చాలు.. రోజుకు రూ. 28వేల వరకు చెల్లిస్తుంది..!

Tesla Train Robot : టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ డెవలప్ చేస్తోంది. ఇందులో భాగంగా భారీ ఆఫర్ అందిస్తోంది. మోషన్-క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి రోబోట్‌కు ట్రైనింగ్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Tesla is paying up to Rs 28k day if you can walk 7 hours ( Image Source : Google )

Tesla Train Robot : ప్రముఖ గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రోజుకు ఏడు గంటలకు పైగా నడిస్తే చాలు.. ఏకంగా రూ. 28వేల వరకు చెల్లిస్తామంటోంది. ఈ రోల్ కోసం గంటకు 48 డాలర్లు (సుమారు రూ. 4వేలు) అందజేస్తుంది. టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ డెవలప్ చేస్తోంది. ఇందులో భాగంగా భారీ ఆఫర్ అందిస్తోంది. మోషన్-క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి రోబోట్‌కు ట్రైనింగ్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అవకాశం ద్వారా శిక్షణలో పాల్గొనే ఔత్సాహికులు రోజుకు రూ.28వేల వరకు సంపాదించవచ్చు.

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డీల్.. ధర ఎంత తగ్గిందంటే? మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!

టెస్లా సీఈఓ అయిన ఎలన్ మస్క్, 2021లో ఆప్టిమస్ అనే కాన్సెప్ట్‌ను మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఈ రోబోను కేవలం ఫ్యాక్టరీ వర్క్ నుంచి ప్రొటెక్షన్ వరకు నిర్వహించే సామర్ధ్యం కలిగిన మల్టీ-ఫంక్షనల్ రోబోగా ఊహించారు. గత సంవత్సరంలో టెస్లా రోబో తయారీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. మోషన్-క్యాప్చర్ సూట్‌ల ద్వారా ఆప్టిమస్‌కి ట్రైనింగ్ ఇవ్వడంలో సాయం చేయడానికి అనేక మంది కార్మికులను నియమించుకుంది.

శిక్షణలో పాల్గొనే వారికి ఉండాల్సిన అర్హతలివే :
“డేటా కలెక్షన్ ఆపరేటర్” పేరుతో ఈ జాబ్‌ ఆఫర్ అందిస్తోంది. మోషన్-క్యాప్చర్ సూట్, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ధరించి రోజూ ఏడు గంటల కన్నా ఎక్కువ సమయం పాటు టెస్టు మార్గాల్లో నడవాల్సి ఉంటుంది. ఈ రోల్‌కు డేటా సేకరణ, విశ్లేషణ, రిపోర్టు రాయడం చిన్న డివైజ్‌లకు సంబంధించిన పనులు కూడా అవసరం. ముఖ్యంగా, ఉద్యోగానికి 5’7 ఎత్తు నుంచి 5’11 మధ్య ఎత్తు ఉండి 30 పౌండ్లు వరకు మోయగల సామర్థ్యం, ఎక్కువ కాలం పాటు వీఆర్ (VR)డివైజ్‌లను ఆపరేట్ చేయగల సామర్థ్యం వంటి నిర్దిష్ట ఫిజికల్ రిక్వైర్ట్‌మెంట్స్ ఉన్నాయి.

వైద్యపరమైన ప్రోత్సాహాకాలు :
ఈ శిక్షణ పోటీలో చెల్లింపుతో పాటు, ఈ టెస్లా ఉద్యోగం పొందిన వ్యక్తులు మొదటి రోజు నుంచి వైద్య, దంత, దృష్టి, కుటుంబ నిర్మాణ సపోర్టు, పదవీ విరమణ ప్రయోజనాలతో సహా అనేక ప్రయోజనాలను పొందగలరు. టెస్లా బేబీస్ ప్రోగ్రామ్, బరువు తగ్గడం, పొగాకు నివారణ ప్రోగ్రామ్‌లు, వివిధ బీమా ఆప్షన్లు వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా కంపెనీ అందిస్తుంది.

ఈ స్థానానికి చెల్లింపు పరిధి గంటకు 25.25 డాలర్ల నుంచి 48 డాలర్లు ఉంటుంది. అభ్యర్థి అనుభవం, నైపుణ్యాలు, లొకేషన్ ఆధారంగా గంటకు సుమారుగా రూ. 2,120 నుంచి రూ. 4వేల వరకు ఉంటుంది. ఈ రోల్ కు ఎంపికైన వారిలో క్యాష్, స్టాక్ అవార్డులు కూడా ఉన్నాయి. రోబోటిక్స్, ఏఐ డెవలప్‌మెంట్‌లో పని చేయడానికి ఆసక్తి ఉన్నవారికి ఇది లాభదాయకమైన అవకాశంగా చెప్పవచ్చు.

వివిధ షిఫ్టుల్లో విధులు :
ఉద్యోగంలో వివిధ షిఫ్టులు కూడా ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. అందులో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు లేదా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12:30 వరకు లేదా అర్ధరాత్రి 12:00 నుంచి ఉదయం 8:30 గంటల వరకు ఉంటాయి. మీరు టెస్లా కెరీర్ పేజీలో అన్ని వివరాలను చెక్ చేయవచ్చు. దీనికి ముందు, ఈ ఉద్యోగం కేవలం పాలో ఆల్టో, కాలిఫోర్నియాలో లొకేషన్‌లో ఉండే నివాసితులకు మాత్రమే అని గుర్తుంచుకోండి.

Read Also : iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ చూశారా? కొత్త డిజైన్ అదుర్స్.. అధికారిక ఫొటో లీక్.. ఫీచర్లు ఇవేనా?

ట్రెండింగ్ వార్తలు