నేనే స్వయంగా వెళ్లి శివ్ నాడార్‌తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించా: నారా లోకేశ్

రికార్డు టైంలో అనుమతులు, భూ కేటాయింపులు చేసి, యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం మంచి..

Nara Lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం టీడీపీ సర్కారు ఉన్న సమయంలో హెచ్‌సీఎల్ క్యాంపస్ కోసం అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అప్పట్లో తానే స్వయంగా వెళ్లి హెచ్‌సీఎల్ ఛైర్‌పర్సన్ శివ్ నాడార్‌తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించానని చెప్పారు.

రికార్డు టైంలో అనుమతులు, భూ కేటాయింపులు చేసి, యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం మంచి అనుభూతినిచ్చిందని నారా లోకేశ్ తెలిపారు. గన్నవరం వైపు వెళ్లిన ప్రతిసారీ యువతకు 4,500 మందికి ఉద్యోగాలు కల్పించామన్న సంతృప్తి, సంతోషం కలిగేవని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా సంస్థ కార్యకలాపాలు ముందుకు సాగలేదని అన్నారు.

20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ కేవలం 4500 మంది వద్దనే ఆగిపోయిందని నారా లోకేశ్ తెలిపారు. పూర్తి స్థాయి అనుమతులు, రాయితీలు ఇవ్వకుండా నిలిపివేసి ఇబ్బందులు పెట్టారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని, అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.

హెచ్‌సీఎల్ పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని నారా లోకేశ్ అన్నారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన క్లియర్ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన రాయితీలను విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు. ఐటీలో వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నందుకు హెచ్‌సీఎల్ సంస్థ ప్రతినిధులకు లోకేశ్ అభినందనలు తెలిపారు.

Also Read: తాడిపత్రిలో హైటెన్షన్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకతో..

ట్రెండింగ్ వార్తలు