తాడిపత్రిలో హైటెన్షన్.. వైసీపీ నేత ఇంటిపై దాడి..!
టీడీపీ కార్యకర్తల ముట్టడిలో వైసీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

Tension In Tadipatri (Photo Credit : Google)
Kethireddy Pedda Reddy : తాడిపత్రి పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చారు. కీలక డాక్యుమెంట్లు తన నివాసంలో ఉండడంతో వాటిని తీసుకెళ్లడానికి పోలీసుల అనుమతితో తాడిపత్రికి వచ్చారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించడానికి యత్నించారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి ముఖ్య అనుచరుడు కందిగోగుల మురళి ఇంటిని కూడా టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. కందిగోగుల మురళికి చెందిన రెండు స్కార్పియో వాహనాలు, ఒక యాక్టివాను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తల ముట్టడిలో వైసీపీ కార్యకర్త అడ్డు రఫీకి తీవ్రగాయాలయ్యాయి. కాగా, పెద్దారెడ్డి తాడిపత్రి నుండి వెళ్లిపోవడంతో టీడీపీ కార్యకర్తలు శాంతించారు. తాడిపత్రి పట్టణంలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. డీఎస్పీ జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : ఆ ఐపీఎస్‌లకు సెలవులు ఇస్తారా? డీజీపీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి