Zomato Group Ordering : జొమాటోలో గ్రూపు ఆర్డరింగ్ ఫీచర్.. ఒకేసారి అందరూ ఆర్డర్ చేయొచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?

Zomato Group Ordering Feature : ఒకేసారి ఎక్కువ మంది వ్యక్తులను ఒకే ఆర్డర్‌లో యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌ సాయంతో వినియోగదారులు ఇప్పుడు వారి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో లింక్‌ను షేర్ చేయవచ్చు.

Zomato announces new group ordering feature ( Image Source : Google )

Zomato Group Ordering Feature : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తమ కస్టమర్ల కోసం ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. అదే.. గ్రూప్ ఆర్డరింగ్‌ ఫీచర్.. గతంలో కన్నా సులభంగా ఆర్డర్ చేసేలా కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇటీవలి ట్వీట్‌లో జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్.. ఈ కొత్త ఫీచర్ గురించి వివరాలను షేర్ చేశారు.

Read Also : Vivo V40 First Sale : వివో V40 ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర, స్పెషిఫికేషన్లు వివరాలివే..!

ఒకేసారి ఎక్కువ మంది వ్యక్తులను ఒకే ఆర్డర్‌లో యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌ సాయంతో వినియోగదారులు ఇప్పుడు వారి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో లింక్‌ను షేర్ చేయవచ్చు. ప్రతి ఒక్కరూ తమకు కావలసిన వంటకాలను నేరుగా కార్ట్‌కి యాడ్ చేయొచ్చు.

“ప్రతిసారి ఆర్డర్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి గ్రూపు ఆర్డర్ చేయొచ్చు. మీరు స్నేహితులతో లింక్‌ను షేర్ చేయవచ్చు. ప్రతి ఒక్కరూ కార్ట్‌కి యాడ్ చేయొచ్చు. అందరూ కలిసి వేగంగా ఆర్డర్ చేయవచ్చు. ప్రతిఒక్కరి ఆర్డర్‌ను రివ్యూ చేసి కస్టమర్‌లందరికీ క్రమంగా అందిస్తున్నాం. ఈ ఫీచర్ మీకు అందుబాటులో ఉంటే.. దయచేసి ఈ రాత్రి మీ హౌస్ పార్టీ కోసం దాన్ని ఉపయోగించండి. అది ఎలా జరుగుతుందో మాకు చెప్పండి” గోయల్ పోస్ట్ చేశారు.

ఇదేలా పనిచేస్తుందంటే? :
గ్రూపు ఆర్డరింగ్ ఫీచర్‌ కోసం వ్యక్తి రెస్టారెంట్‌ను ఎంచుకోవాలి. కార్ట్‌కి మొదటి ఆర్డర్ యాడ్ చేయాలి. గ్రూపులోని ఇతరులతో షేర్ చేయడానికి లింక్‌ను క్రియేట్ చేయొచ్చు. ప్రతి వ్యక్తి లింక్‌పై క్లిక్ చేయవచ్చు.నచ్చిన మెనుని బ్రౌజ్ చేయవచ్చు. షేర్ చేసిన కార్ట్‌కు వారి సొంత విషయాలను యాడ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ వారి ఆప్షన్లను యాడ్ చేసిన తర్వాత ఇనిషియేటర్ కంబైన్డ్ ఆర్డర్‌ను రివ్యూ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ హౌస్ పార్టీ, క్యాజువల్ గెట్-టుగెదర్ లేదా ఆఫీస్ లంచ్ కోసం అయినా కమ్యూనిటీ లంచ్ నిర్వహించేందుకు రూపొందించింది.

క్రమంగా కస్టమర్లందరికి :
గోయల్ ప్రకారం.. జొమాటో క్రమంగా కస్టమర్లందరికీ గ్రూప్ ఆర్డరింగ్ ఫీచర్‌ను అందజేస్తోంది. మీ యాప్‌లో ఫీచర్ అందుబాటులో ఉన్నట్లయితే.. దీన్ని ప్రయత్నించి, మీ అనుభవాన్ని షేర్ చేసుకోవాలని జొమాటో యూజర్లను ప్రోత్సహిస్తుంది. ఈ ఫీచర్‌తో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చునని కంపెనీ విశ్వసిస్తోంది. జొమాటో గ్రూప్ ఆర్డరింగ్‌ని ప్రవేశపెట్టడం ద్వారా యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి, ఫుడ్ డెలివరీని మరింత సౌకర్యవంతంగా అందిస్తుంది.

జొమాటో ఈ ఫీచర్ మరింత మెరుగుపరచేందుకు యూజర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది. మీరు స్నేహితులతో డిన్నర్ ప్లాన్ చేస్తున్నప్పుడు లేదా హౌస్ పార్టీని హోస్ట్ చేస్తున్నప్పుడు మీ జొమాటో యాప్‌లో గ్రూప్ ఆర్డరింగ్ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయండి. మీ సమయాన్ని ఆదా చేస్తుంది. ఆర్డరింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది.

Read Also : WhatsApp Block Messages : వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ ఫీచర్.. ఇకపై అన్‌నౌన్ మెసేజ్‌లను ఈజీగా బ్లాక్ చేయొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు