Lectrix EV LXS 2.0 : లెక్ట్రిక్స్ ఈవీ LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఫుల్ ఛార్జ్‌తో 98 కి.మీ రేంజ్, ధర ఎంతంటే?

Lectrix EV LXS 2.0 e-scooter : భారత మార్కెట్లోకి ఈవీ స్టార్టప్ నుంచి సరికొత్త లెక్ట్రిక్స్‌ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. 60కిలోమీటర్ల గరిష్ట వేగంతో పాటు ధర, ఫీచర్లు, బుకింగ్స్, డెలివరీ వంటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Lectrix EV LXS 2.0 e-scooter launched with a range of 98 km

Lectrix EV LXS 2.0 e-scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో ఈవీ వాహనాలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ఈ డిమాండ్‌కు తగినట్టుగానే వాహన తయారీదారులకు కూడా కొత్త ఈవీ వాహనాలను మార్కెట్లోకి దించుతున్నారు. ఇప్పుడు, భారత మార్కెట్లోకి పాపులర్ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ లెక్ట్రిక్స్‌ ఈవీ స్టార్టప్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఈ లెక్ట్రిక్స్‌ కంపెనీ ప్రవేశపెట్టిన (LXS 2.0) స్కూటర్ సరసమైన ధరలో హై రేంజ్‌ ఫీచర్లతో అందుబాటులో ఉంది.

Read Also : Bajaj Chetak electric scooter : 2024 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసిందోచ్.. ధర, వేరియంట్లు, ఫీచర్లు పూర్తివివరాలివే..

ధర ఎంతంటే? :
ఎల్ఎక్స్ఎస్ 2.0 ఈవీ స్కూటర్ ధర రూ. 79,999(ఎక్స్‌-షోరూమ్‌)కు కొనుగోలు చేయొచ్చు. లాంగ్ డ్రైవ్ చేసే వాహనదారులకు ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. లాంచ్ చేయడానికి ముందుగానే ఈ స్కూటర్ సామర్థంపై 1.25 లక్షల కిలోమీటర్ల వరకు టెస్ట్‌ రన్‌ నిర్వహించినట్టు కంపెనీ వెల్లడించింది. టెస్ట్‌ రన్‌ సక్సెస్ అయిందని, ఎలాంటి సమస్యలు లేవని లెక్ట్రిక్స్‌ ఈవీ స్పష్టం చేసింది.

ఫుల్ ఛార్జింగ్‌పై 98కి.మీ రేంజ్ :
లెక్ట్రిక్స్‌ ఈవీ 2.0 స్కూటర్ 2.3కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. భారీ బ్యాటరీ కలిగిన ఈవీ స్కూటర్ ధర రూ. 79,999(ఎక్స్-షోరూమ్)కు ప్రవేశపెట్టింది. ఫుల్ ఛార్జింగ్‌పై 98 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదని కంపెనీ వెల్లడించింది. కొత్త లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద 3కిడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. చిన్న బ్యాటరీ సామర్థ్యం మినహా మోడల్ ఒకే మాదిరిగా ఉంటుంది.

Lectrix EV LXS 2.0 e-scooter launch 

గరిష్ట వేగం 60కి.మీ ప్రయాణం :
ఇ-స్కూటర్ 2.2కిలోవాట్ (2.9బీహెచ్‌పీ) బీఎల్‌డీసీ హబ్ మోటార్‌ను పొందుతుంది. గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు వేగాన్ని అందుకుంటుంది. ఇతర ఫీచర్లలో 25 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్, 90/110 ఫ్రంట్, 110/90 బ్యాక్ 10-అంగుళాల టైర్లు, ఫాలో-మీ హెడ్‌ల్యాంప్ ఫంక్షన్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

బుకింగ్స్ ఓపెన్.. మార్చి నుంచే డెలివరీలు :
ఇప్పటికే, ఈవీ స్కూటర్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. లెక్ట్రిక్స్‌ ఈవీ 2.0 కొనుగోలు చేసే వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఇక డెలివరీల విషయానికి వస్తే.. వచ్చే మార్చి 2024 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందరి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈవీ స్కూటర్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Read Also : Kinetic Luna electric : కైనెటిక్ లూనా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 7నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు