Poco F6 5G Sale : పోకో F6 5జీ ఫోన్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు.. లాంచ్ ఆఫర్లు ఇదిగో!

Poco F6 5G Sale : ఈ ఫోన్ మొత్తం 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో రెండు వేరియంట్లలో వస్తుంది. పోకో F6 5జీ ఫోన్ 1.5కె రిజల్యూషన్‌తో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Poco F6 5G Goes on Sale in India ( Image Credit : Google )

Poco F6 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో మొదటిసారిగా పోకో F6 5జీ ఫోన్ సేల్ ప్రారంభమైంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేదికగా పోకో ఎఫ్6 ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంది. క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీతో పోకో ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ గత వారం దేశంలో లాంచ్ అయింది.

ఈ ఫోన్ మొత్తం 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో రెండు వేరియంట్లలో వస్తుంది. పోకో F6 5జీ ఫోన్ 1.5కె రిజల్యూషన్‌తో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 90డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Poco C61 Launch : భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేతో పోకో C61 ఫోన్ లాంచ్.. భారత్‌లో ధర కేవలం రూ.6,999 మాత్రమే!

భారత్‌లో పోకో F6 5జీ ఫోన్ ధర, సేల్ ఆఫర్లు :
భారత మార్కెట్లో పోకో F6 5జీ ఫోన్ బేస్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 29,999, అదే సమయంలో 12జీబీ ర్యామ్+256జీబీ, 12జీబీ + 512జీబీ ఆప్షన్లు వరుసగా ధర రూ. 31,999, రూ.33,999కు పొందవచ్చు. బ్లాక్, టైటానియం కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి అందుబాటులో ఉండనుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. HDFC, ICICI, SBI కార్డ్ వినియోగదారులు లావాదేవీలపై రూ. 2వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ పోకో 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ. 25,999కు పొందవచ్చు. 12జీబీ+ 256జీబీ, 12జీబీ + 512జీబీ ర్యామ్, స్టోరేజ్ వెర్షన్‌లను వరుసగా రూ.27,999, రూ. 29,999కి కొనుగోలు చేయవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లలో నెలకు రూ.2,500 నుంచి ప్రారంభమవుతాయి.

పోకో F6 5జీ స్పెసిఫికేషన్లు :
పోకో F6 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ఓఎస్ ఇంటర్‌ఫేస్‌పై రన్ అవుతుంది. 6.67-అంగుళాల 1.5కె (1,220×2,712 పిక్సెల్‌లు) రిజల్యూషన్ అమోల్డ్ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 446పీపీఐ పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంటుంది. మూడు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను స్వీకరించింది. ఈ 5జీ ఫోన్ 12జీబీ వరకు ఎల్‌పీపీ‌డీడీఆర్5ఎక్స్ ర్యామ్‌తో ఆక్టా-కోర్ 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీతో రన్ అవుతుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. పోకో F6 5జీ ఫోన్ 50ఎంపీ 1/1.9-అంగుళాల సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్, 8ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్355 అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు 20ఎంపీ ఓవీ20బీ ఫ్రంట్ కెమెరా ఉంది. 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని కలిగి ఉంటుంది.

పోకో F6 5జీలోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్/ఏజీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, బీడౌ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ఐఆర్ బ్లాస్టర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ64-రేట్ అయింది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : Poco F6 5G Launch : పవర్‌పుల్ ప్రాసెసర్‌, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పోకో F6 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలివే

ట్రెండింగ్ వార్తలు