Jio Customers : తెలుగు రాష్ట్రాల్లో జియో ప్రభంజనం.. కొత్తగా 1.06 లక్షలకుపైగా కస్టమర్లు!

Reliance Jio Customers : ట్రాయ్ కొత్త గణాంకాల ప్రకారం.. గత మార్చిలో జియో అత్యధికంగా 1,06,565 మంది మొబైల్ కస్టమర్లను చేరుకుంది. రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్య మార్చి నెలాఖరి నాటికి 3.27 కోట్లకు చేరుకుంది.

Reliance Jio Customers : తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో ప్రభంజనం సృష్టిస్తోంది. రోజురోజుకీ సరికొత్త కస్టమర్లతో జియో దూసుకుపోతోంది. తాజాగా ట్రాయ్ (TRAI) రిలీజ్ చేసిన టెలికాం కస్టమర్ల గణాంకాల ప్రకారం.. జియో ఈ 2024 ఏడాదిలో మార్చిలో కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 1.06 లక్షలకు పైగా కస్టమర్లను చేరుకుంది.

Read Also : Motorola Edge 50 Fusion : ఈ నెల 16న మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? 

ట్రాయ్ కొత్త గణాంకాల ప్రకారం.. గత మార్చిలో జియో అత్యధికంగా 1,06,565 మంది మొబైల్ కస్టమర్లను చేరుకుంది. రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్య మార్చి నెలాఖరి నాటికి 3.27 కోట్లకు చేరుకుంది.

గత ఏడాదిలో భారతీ ఎయిర్‌టెల్ ఇదే నెలలో 97 లక్షల మంది కస్టమర్లను చేరుకోగా, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌ (BSNL)లో 15,432 మంది కొత్త మొబైల్ కస్టమర్లు చేరారు. మరోవైపు.. వోడాఫోన్ఐడియా (Vodafone Idea) 48,690 మంది కస్టమర్లను కోల్పోయింది.

దేశవ్యాప్తంగా మార్చిలో రిలయన్స్ జియో ఆధిపత్యాన్ని కొనసాగించగా, జియోలో 21.43 లక్షల మంది కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు. ఈ గణాంకాల ప్రకారం.. 2024 మార్చిలో దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో మొత్తం కస్టమర్ల సంఖ్య 46.97 కోట్లకు చేరింది.

Read Also : Google Pixel 8a Launch : గూగుల్ పిక్సెల్ 8ఎ ఫోన్ వచ్చేసిందోచ్.. బ్యాంకు ఆఫర్లతో రూ.39,999కే సొంతం చేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు