Vivo T3 Lite 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? వివో టీ3 లైట్ 5జీ వచ్చేసిందోచ్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Vivo T3 Lite 5G Launch : వివో టీ3 లైట్ 5జీ భారత మార్కెట్లో ప్రారంభ ధర 4జీబీ+ 128జీబీ ఆప్షన్ రూ. 10,499, 6జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 11,499కు పొందవచ్చు.

Vivo T3 Lite 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి వివో కొత్త టీ3 లైట్ 5జీ ఫోన్ వచ్చేసింది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, ఐపీ64-రేటెడ్ బిల్డ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. గ్లోబల్ కంపెనీ వెబ్‌సైట్‌లో అధికారికంగా లిస్టు అయిన వివో Y28ఎస్ 5జీ రీబ్యాడ్జ్ వెర్షన్‌గా కనిపిస్తుంది. కొత్తగా లాంచ్ అయిన వివో టీ3 లైట్ 5జీ బేస్, ఎక్స్ వేరియంట్‌లను కలిగి ఉంది. దేశంలో ఇప్పటికే ఉన్న వివో టీ3 5జీ లైనప్‌లో చేరింది. వచ్చే నెల ప్రారంభంలో విక్రయానికి అందుబాటులో ఉంటుందని ధృవీకరించింది.

Read Also : New Telecom Act : కొత్త టెలికం చట్టం అమల్లోకి.. ఇకపై ప్రభుత్వానిదే అధికారం.. కీలక మార్పులివే.. వినియోగదారులపై ప్రభావం ఎంతంటే?

భారత్‌లో వివో టీ3 లైట్ 5జీ ధర ఎంతంటే? :
వివో టీ3 లైట్ 5జీ భారత మార్కెట్లో ప్రారంభ ధర 4జీబీ+ 128జీబీ ఆప్షన్ రూ. 10,499, 6జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 11,499కు పొందవచ్చు. ఈ వివో ఫోన్ దేశంలో జూలై 4న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా వెబ్‌సైట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు వివో టీ3 లైట్ 5జీ కొనుగోలు సమయంలో 500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధరను రూ. 9,999కి కి తగ్గిస్తుంది. వివో టీ3 లైట్ 5జీ ఫోన్ మెజెస్టిక్ బ్లాక్, వైబ్రంట్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

వివో టీ3 లైట్ 5జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు :
వివో టీ3 లైట్ 5జీ ఫోన్ 6.56-అంగుళాల హెచ్‌డీ+ (1,612 x 720 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్, 840నిట్స్ ప్రకాశం స్థాయిని కలిగి ఉంది. 6ఎన్ఎమ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ ద్వారా 6జీబీ వరకు ర్యామ్, 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ ర్యామ్ 6జీబీ అదనంగా పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14తో ఫోన్ షిప్‌లను అందిస్తోంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వివో టీ3 లైట్ 5జీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఇందులో ఏఐ సపోర్టు గల 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెంట్రల్ వాటర్‌డ్రాప్ నాచ్‌లో ఉంచిన 8ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. వివో టీ3 లైట్ 5జీ ఫోన్ 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ64 రేటింగ్‌తో వస్తుంది. భద్రత విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ 5జీ కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇస్తుంది. 185గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Reliance Jio Tariff Hikes : జియో యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన టారిఫ్ ధరలు.. కొత్త ప్లాన్ల వివరాలివే..!

ట్రెండింగ్ వార్తలు