Sexual Abuse : కరస్పాండెంట్ వేధిస్తున్నాడని నర్సింగ్ విద్యార్ధినుల ధర్నా

కళాశాల కరస్పాడెంట్ వేధిస్తున్నాడనే ఆరోపణతో నర్సింగ్ విద్యార్ధినులు రోడ్డుపై రాస్తారోకో చేపట్టిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. 

Sexual Abuse:  కళాశాల కరస్పాడెంట్ వేధిస్తున్నాడనే ఆరోపణతో నర్సింగ్ విద్యార్ధినులు రోడ్డుపై రాస్తారోకో చేపట్టిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.  దిండుగళ్-పళని రోడ్డు సమీపంలోని ముత్తంపట్టి ప్రాంతంలో జ్యోతి మురుగన్ అనే వ్యక్తి   కరస్పాండెంట్ గా ఉంటూ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలను నడుపుతున్నాడు.

ఈ కళాశాలలో సుమారు 250 మంది విద్యార్ధినులు చదువుకుంటున్నారు.  జ్యోతి మురుగన్ విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.  ఈ వ్యవహారంపై శుక్రవారం ఉదయం వందమందికి పైగా విద్యార్ధినులు పోలీసు హెల్ప్ లైన్ నెంబర్ 1098 కి ఫిర్యాదు చేశారు.

Also Read : Lady Doctor Raped by Colleagues : తోటి మహిళా డాక్టర్లపై అత్యాచారం.. వీడియో తీసిన కీచక డాక్టర్లు

అనంతరం సుమారు 200 మంది విద్యార్ధినులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో   చేపట్టారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన జిల్లా ఎస్పీ   అరుణ్ కబిలన్   విద్యార్ధినులతో మాట్లాడారు.   ఈక్రమంలో ఆరోపణలు ఎదుర్కోంటున్న జ్యోతి మురుగన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు హాస్టల్ వార్డెన్ అర్చనను,  జ్యోతి మురుగన్ తల్లితండ్రులను,ఇతర  కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు