Uttar Pradesh : యూపీలో దారుణ ఘటన.. భర్త సోదరుడి చేతిలో అత్యాచారంకు గురైన మహిళ.. భర్త ఏం చేశాడంటే!
భర్తకు జరిగిన విషయాన్ని చెప్పగా.. ఆగ్రహంతో ఊగిపోయిన అతను.. నువ్వు నా భార్యవు కాదు అంటూ ప్రకటించాడు. మరుసటి రోజు తన భర్త, అతని సోదరుడు
- Harishth Thanniru
- Published On : April 28, 2024 / 12:14 PM IST
Woman
Lucknow : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముజఫర్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన సోదరుడితో కలిసి భార్యను హత్యచేసేందుకు ప్రయత్నించాడు. భర్త తన సతీమణిని చంపేందుకు ప్రయత్నిస్తుండగా.. అతని సోదరుడు వీడియో తీశాడు. అయితే, ఆమె వారి దాడి నుంచి ఎలాగోలా తప్పించుకొని బయటపడింది. జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయంలో వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
యూపీలోని ముజఫర్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి జీవనం సాగిస్తుంది. ఏప్రిల్ 2న భర్తలేని సమయంలో అతని సోదరుడు వచ్చి ఆమెపై అత్యాచారంకు పాల్పడ్డాడు. భర్త ఇంటికి తిరిగి వచ్చిన తరువాత జరిగిన విషయాన్ని చెప్పింది. ఆగ్రహంతో ఊగిపోయిన అతను.. ఇకనుంచి నువ్వు నా భార్యవి కాదు అంటూ చెప్పాడు. మరుసటి రోజు భర్త, అతని సోదరుడు ఆమె గదిలోకి వచ్చి హత్యచేసేందుకు ప్రయత్నించారు. భర్త ఆమె ఛాతిపై కూర్చొని గొంతుకోసే ప్రయత్నం చేయగా.. అతని సోదరుడు తన మొబైల్ లో ఈ ఘటనను రికార్డు చేశాడు. అయితే, ఆమె వారి నుంచి తప్పించుకొని.. తనను హత్యచేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందుతులపై కేసు నమోదు చేశారు.
ఖతౌలీ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో నిందితుడైన భర్త, అతని సోదరుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు.
