Kannada actor Darshan : వెలుగుచూసిన కన్నడ నటుడి పులిగోరు ఫొటోలు…అటవీశాఖ అధికారుల సోదాలు

కన్నడ నటుడు, సినీ నిర్మాత దర్శన్ తూగుదీప శ్రీనివాస్ పులి గోరు ధరించి కనిపించడం సంచలనం రేపింది. దర్శన్ పులి గోరు ధరించిన ఫొటోలు వెలుగుచూడటంతో స్థానికి రాజకీయ పార్టీ కార్యకర్త దీనిపై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు....

Kannada actor Darshan

Kannada actor Darshan : కన్నడ నటుడు, సినీ నిర్మాత దర్శన్ తూగుదీప శ్రీనివాస్ పులి గోరు ధరించి కనిపించడం సంచలనం రేపింది. దర్శన్ పులి గోరు ధరించిన ఫొటోలు వెలుగుచూడటంతో స్థానికి రాజకీయ పార్టీ కార్యకర్త దీనిపై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పులి గోరు ధరించిన కన్నడ నటుడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర అటవీశాఖ అధికారులు అతని ఇంట్లో సోదాలు జరిపారు.

Also Read :  T Congress : రేపు టీ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల.. 40 మంది అభ్యర్థులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్

ఇటీవల శ్రీ క్షేత్ర హోరనాడు ఆలయాన్ని సందర్శించిన శ్రీనివాస్ మెడలో పులిగోరు ధరించి ఉండటం ఫొటోలో కనిపించింది. బెంగళూరులోని శ్రీనివాస్ నివాసంలో జరిపిన సోదాల్లో పులి గోరులాంటి పదార్థం లభించింది. మెటీరియల్ తనిఖీ కోసం దీని నమూనాను అటవీశాఖ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు.

Also Read : MLA Haripriya : ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ

వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులను చంపడం, వాటి గోళ్లు, చర్మాలు, కొమ్ములు మొదలైన వాటిని ఉంచుకోవడం లేదా విక్రయించడం చట్టరీత్యా నేరం. ఇటీవల కన్నడ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఓ కంటెస్టెంట్ మెడలో పులిగోరు కనిపించడంతో అతన్ని కూడా అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు