APSGWD Recruitment : ఆంధ్రప్రదేశ్ భూగర్భ జల, జల గణన శాఖలో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ తో పాటుగా సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను సంబంధిత జిల్లాల భూగర్భ జల అధికారులకు పంపాల్సి ఉంటుంది.

APSGWD Recruitment : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూగర్భ జల , జలగణన శాఖ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 74 టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ తో పాటుగా సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను సంబంధిత జిల్లాల భూగర్భ జల అధికారులకు పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలను అక్టోబర్ 10, 2022న జిల్లా భూగర్భ జల,జల గణన శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహిస్తారు. దరఖాస్తుకు చివరి తేదిగా సెప్టెంబర్ 30 , 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్; https://apsgwd.ap.gov.in పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు