Nursing Officer Posts : దేశవ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్ధల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే డిప్లొమా తోపాటు రెండు సంవత్సరాల పని అనుభవం లేదంటే బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ , పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్ , ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్సులుగా నమోదై ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

Nursing Officer Posts : న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తోపాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎమ్స్ సంస్ధల్లో ఖాళాగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,055 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్ మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ ను నిర్వహించనున్నారు.

READ ALSO : Cultivation of vegetables : ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే డిప్లొమా తోపాటు రెండు సంవత్సరాల పని అనుభవం లేదంటే బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ , పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్ , ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్సులుగా నమోదై ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఇతర కేటగిరికి చెందిన వారికి మినహాయింపు ఉంటుంది.

అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి నార్ సెట్ 4 స్కోరు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 9300 నుండి 34800 వేతనంతోపాటు, 4600 గ్రేడ్ పే అందుతుంది.

READ ALSO :  Neem Benifits : వేపతో వ్యవసాయంలో బహుళ ప్రయోజనాలు!

దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు గడువు మే 5, 2023గా నిర్ణయించారు. పరీక్షను జూన్ 3, 2023న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aiimsexams.ac.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు