Gurucharan : టాలీవుడ్‌లో విషాదం.. సీనియ‌ర్ పాట‌ల ర‌చ‌యిత క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది.

Telugu Lyricist Guru Charan passed away

Gurucharan : టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గీత రచయిత గురుచరణ్ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గురువారం తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 77 సంవ‌త్స‌రాలు. ‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు’, ‘కుంతీకుమారి తన కాలుజారి’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా’ వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలను ఆయ‌న రాశారు.

అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడే గురుచ‌ర‌ణ్‌. ఆయ‌న అస‌లు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. ఎంఎ వ‌ర‌కు చ‌దివారు. గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్య‌రికం చేశారు. దాదాపు రెండు వంద‌ల‌కు పైగా సినిమాల‌కు పాట‌లు రాశారు.

NTR fan : దేవ‌ర సినిమా చూసే వ‌ర‌కు బ‌తికించండి.. బ్ల‌డ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్ వేడుకోలు

ప్ర‌ముఖ న‌టుడు మోహన్‌బాబుకు ఎంతో ఇష్టమైన పాటల రచయిత. మోహన్‌బాబు నటించిన చిత్రాలలో క‌నీసం ఒక్క పాట‌ను అయిన‌ గురుచరణ్‌తో తప్పకుండా రాయించుకునేవారు. మోహన్ బాబు చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో మెలోడీ, అర్థవంతమైన పాటలను గురుచరణ్ రచించారు.

ట్రెండింగ్ వార్తలు