Hema : చార్జ్ షీట్‌లో నా పేరు వచ్చినట్టు తెలిసింది.. మీడియా వ‌ల్ల‌నే నాపేరు : న‌టి హేమ‌

బెంగ‌ళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ న‌టి హేమ‌కు చుక్కెదురైంది.

Actress Hema : బెంగ‌ళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ న‌టి హేమ‌కు చుక్కెదురైంది. సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు సోమవారం కోర్టులో చార్జ్ షీట్ దాఖ‌లు చేశారు. న‌టి హేమ డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు అందులో పేర్కొన్నారు. ఆమె MDMA డ్రగ్స్‌ను తీసుకున్న‌ట్లు మెడిక‌ల్ రిపోర్టును జ‌త చేశారు. ఆమెతో స‌హా 88 మంది డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు వివ‌రించారు. రేవ్ పార్టీ నిర్వాహ‌కులుగా 9 మందిని పేర్కొన్నారు. ఆమెను స్నేహితుడు వాసు పార్టీకి పిలిచిన‌ట్లు అధికారులు నిర్ధారించారు. మొత్తం 1086 పేజీలతో కూడిన చార్జ్ షీటును కోర్టుకు సమర్పించారు.

ఈ కేసులో ఇప్ప‌టికే హేమ బెంగ‌ళూరులోని ప‌ర‌ప్ప‌ణ అగ్ర‌హార జైలులో 14 రోజుల జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డిలో ఉంది. ఆ త‌రువాత ఆమెకు బెంగళరు రూరల్‌ ఎన్డీపీఎస్‌ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే. డ్రగ్స్‌ కేసులో పట్టుబడటంతో ఆమెను సస్పెండ్‌ చేస్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ త‌రువాత ఆగస్టులో హేమపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.

Also Read: దేవ‌ర సినిమా చూసే వ‌ర‌కు బ‌తికించండి.. బ్ల‌డ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్ వేడుకోలు

10టీవీ తో ఫోన్ లో హేమ…
డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఛార్జ్‌షీటులో పోలీసులు పేర్కొన‌డంపై సినీ న‌టి హేమను 10టీవీ సంప్ర‌దించ‌గా ఫోన్‌లో స్పందించారు. ”నేను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదు. బెంగళూరు పోలీసులు చార్జ్ షీట్‌లో నా పేరు వచ్చినట్టు తెలిసింది. నేను డ్ర‌గ్స్‌ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. చార్జ్ షీట్ నాకు వచ్చాక అప్పుడు దానిపై నేను స్పందిస్తాను. నాకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్ లో నెగిటివ్ అని చార్జ్ షీట్ లో వేశారు. MDMA నేను డ్రగ్స్ తీసుకోలేదు. మీడియా వలనే నాపేరు ఛార్జ్ షీట్ లో పెట్టార”ని హేమ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు