NTR fan : దేవర సినిమా చూసే వరకు బతికించండి.. బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్ వేడుకోలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

NTR Fan who Suffers blood cancer last wish was to watch devara movie
NTR fan : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. ఆయన అభిమాని ఒకరు బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. అయితే.. సదరు అభిమాని చివరి కోరిక ఏంటో తెలిస్తే హృదయం ద్రవించకమానదు. తనను బతికించమని అడగడం లేదు. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా చూసే వరకు బ్రతికించండి చాలు అంటూ వేడుకుంటున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్(19) 2022 నుంచి బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ఎన్టీఆర్‌కు ఆయన వీరాభిమాని. ప్రస్తుతం అతడు బెంగళూరులోని కిడ్‌వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేవర సినిమా చూసేంత వరకు అయినా బతికించాలని సదరు అభిమాని అక్కడి డాక్టర్లను వేడుకుంటున్నాడు. ఈ క్రమంలో తమ కొడుకు చివరి కోరిక తీర్చాలని అతడి తల్లిదండ్రులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హీరో జూనియర్ ఎన్టీఆర్‌లను ప్రాధేయపడుతున్నారు.
Mokshgna Teja : ఫస్ట్ సినిమాకే.. ఇంత రెమ్యూనరేషనా?
కౌశిక్ తల్లి సరస్వతి మీడియాతో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటే కౌశిక్‌కు ఎంతో ఇష్టం అని తెలిపింది. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అంటే చాలు పండగ చేసుకునేవాడు. రెండు సంవత్సరాలుగా బ్లడ్ క్యాన్సర్‌తో అతడు బాధపడుతున్నాడు. అతడి చికిత్స కోసం రూ.60లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. అప్పటి వరకు అయినా తనను బతికించమని డాక్టర్లను వేడుకుంటున్నాడు. దీన్ని చూస్తుంటే ప్రాణం పోతుంది అని ఆమె కన్నీరు పెట్టుకుంది.
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Jayam Ravi : హీరో జయం రవి విడాకుల ప్రకటన.. అతడి భార్య ఆర్తి సంచలన ఆరోపణ..
View this post on Instagram