Mokshgna Teja : ఫస్ట్ సినిమాకే.. ఇంత రెమ్యూనరేషనా?
నందమూరి నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాతోనే అదరగొడుతున్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : September 11, 2024 / 09:45 PM IST
Mokshgna Teja Remuneration for Debute Movie
Mokshgna Teja Remuneration : నందమూరి నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాతోనే అదరగొడుతున్నాడు. తొలి సినిమాకే రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మోక్షజ్ఞ.. సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాడని టాలీవుడ్ టాక్. మోక్షజ్ఞ లెవెల్‌లో ఇప్పటివరకు ఏ కొత్త హీరో రెమ్యునరేషన్ తీసుకోలేదట… నందిమూరి అభిమానులు… మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకి బాలయ్య తీసుకున్న ఇంట్రెస్ట్‌తో సినిమా డెఫినిట్‌గా సక్సెస్ అవుతుందనే అంచనాతో భారీగా రెమ్యునరేషన్ చెల్లించేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారంటున్నారు. ఇంతకీ మోక్షజ్ఞ రికార్డు పారితోషికం ఎంతో తెలుసా…? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే….
బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఈ మధ్యే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారథ్యంలో చిత్రీకరించనున్న సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజశ్వని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రాబోతోందని చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞ రెమ్యునరేషన్‌పై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో మోక్షజ్ఞకు రికార్డు స్థాయిలో పారితోషికం చెల్లించేందుకు నిర్మాతలు ముందుకువచ్చారంటున్నారు.
Jayam Ravi : హీరో జయం రవి విడాకుల ప్రకటన.. అతడి భార్య ఆర్తి సంచలన ఆరోపణ..
టాలీవుడ్‌లో ఇప్పటివరకు స్టార్ హీరోల వారసులు ఎవరు ఎంట్రీ ఇచ్చినా వారి పారితోషికం కోటి, రెండు కోట్లు మాత్రమే ఉండేది. కొందరైతే మొదటి సినిమాకు ఎలాంటి పారితోషికం ఆశించేవారు కాదంటున్నారు. సినిమా సక్సెస్ అయ్యాకే లాభాల్లో ఎంతో కొంత మొత్తం తమ ఫస్ట్ రెమ్యునరేషన్‌గా తీసుకునేవారట.. కానీ, మోక్షజ్ఞ మాత్రం అందరికీ భిన్నంగా తన ఫస్ట్ సినిమాకే 20 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే స్థాయిని అందుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా తన డెబ్యూ మూవీకి ఇంతలా రెమ్యునరేషన్ తీసుకోలేదంటున్నారు. టైర్ 2 హీరోలు కూడా ఇంకా ఆ రేంజ్‌ను చేరుకోలేదంటున్నారు. కానీ ఫస్ట్ సినిమాకే భారీ మొత్తం తీసుకోవడం ద్వారా మోక్షజ్ఞ రికార్డు సృష్టించాడని అంటున్నారు.
