Jayam Ravis wife Aarti Divorce announcement was made without my consent
Jayam Ravi – Aarti : కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయంపై ఆయన భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన చేశారని అన్నారు. రవి చేసిన ప్రకటన చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు.
ఆ లేఖలో.. నా అనుమతి లేకుండా, నాకు తెలియకుండానే విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించారు. దీన్ని చూసి దిగ్భ్రాంతికి గురి అయ్యాను అని ఆర్తి తెలిపింది. ఎంతో భాధపడినట్లుగా చెప్పుకొచ్చింది. 18 ఏళ్లుగా కలిసి జీవించామని, ఇంతటి ముఖ్యమైన విషయాన్ని తనకు చెప్పకుండా ప్రకటించడం బాధించిందని తెలిపింది. తమ మధ్య విభేదాలు ఉన్నాయని, అయితే వాటిని పరిష్కరించుకునేందుకు ఎంతో ప్రయత్నించానని అంది.
Jiiva : కోలీవుడ్ స్టార్ హీరో జీవాకు యాక్సిడెంట్.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. నుజ్జునుజ్జు..
తన భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ఇప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నట్లుగా తెలిపింది. అయితే.. దురదృష్టవశాత్తు తనకు ఆ అవకాశం దక్కలేదంది. విడాకుల ప్రకటనతో తనతో పాటు తన పిల్లలు కూడా షాక్ అయ్యారని తెలిపారు. ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. బాధ కలిగినప్పటికీ తాను గౌరవంగా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకనే పబ్లిక్‌గా ఎలాంటి కామెంట్లు చేయడం లేదన్నారు.
అన్యాయంగా తనపై నిందలు వేసి, తనను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం కష్టంగా ఉందన్నారు. ఓ తల్లిగా తన మొదటి ప్రాధాన్యత తన పిల్లల శ్రేయస్సేనని చెప్పుకొచ్చారు. వారిపై ఈ వార్త ప్రభావాన్ని చూపుతుందనే విషయం తనకు బాధ కలిగిస్తోందన్నారు. కాలం అన్నింటికి సమాధానం చెబుతుందని తాను నమ్ముతున్నట్లుగా భావిస్తున్నానని చెప్పింది. ఇక ఇన్నాళ్లుగా మద్దతు ఇచ్చిన మీడియా, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులోనూ మా గోపత్యకు ఎలాంటి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ఆర్తి ఆ లేఖలో పేర్కొంది.
Sai Durgha Tej : అమ్మ అనాథాశ్రమానికి మెగా మేనల్లుడి విరాళం..