Sai Durgha Tej : అమ్మ అనాథాశ్రమానికి మెగా మేనల్లుడి విరాళం..
సామాజిక సేవా కార్యక్రమాలను చేసే హీరోల్లో సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ ఒకరు.

Sai Durgha Tej personally visited Amma Orphanage to donate the promised amount
Sai Durgha Tej : సామాజిక సేవా కార్యక్రమాలను చేసే హీరోల్లో సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ ఒకరు. భారీ వర్షాలు, వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడగా ఆదుకునేందుకు తన వంతుగా రూ.20లక్షల విరాళాన్ని ఏపీ, తెలంగాణ సీఎంల రిలీఫ్ పండ్‌లకు తేజ్ అందించారు. ఇక తాజాగా ఆయన అమ్మ అనాథాశ్రమానికి విరాళం అందజేశారు.
సాయి దుర్గా తేజ్ బుధవారం విజయవాడలో పర్యటించారు. ముందుగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శంచుకున్నారు. అనంతరం అమ్మ అనాథాశ్రమానికి వెళ్లారు. అక్కడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అమ్మ అనాథశ్రమానికి రూ.2 లక్షలు, ఇతర సేవా సంస్థలకు రూ.3లక్షల విరాళం అందజేశారు.
Samantha : సమంత డైలీ చేసే పనులివే.. డైలీ రొటీన్ అంటూ వీడియో షేర్ చేసిన సమంత..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తేజ్..
2019లో తన పుట్టిన రోజు సందర్భంగా సాయి ధరమ్ తేజ్ అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆయన 2021లో భవనం కట్టి ఇచ్చారు. మూడు సంవత్సరాల పాటు ఆశ్రమాన్ని దత్తత తీసుకున్నారు. మొత్తం ఖర్చులను భరించారు. సాయి దుర్గాతేజ్ మంచి మనసుకు ఆశ్రమవాసులతో పాటు ప్రజలందరి ప్రశంసలు దక్కాయి. మేనమామ, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి సేవా గుణాన్ని పుణికిపుచ్చుకున్న సాయి దుర్గాతేజ్ భవిష్యత్తులోనూ తనకు వీలైనంత సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికి తన వంతుగా అండగా నిలబడాలని స్థానిక వాసులు కోరుకుంటున్నారు.