Samantha : సమంత డైలీ చేసే పనులివే.. డైలీ రొటీన్ అంటూ వీడియో షేర్ చేసిన సమంత..

తాజాగా తన సోషల్ మీడియాలో తన డైలీ రొటీన్ ఇదే అని ప్రతి రోజు తను చేసే పనులు వీడియో రూపంలో షేర్ చేసింది సమంత.

Samantha : సమంత డైలీ చేసే పనులివే.. డైలీ రొటీన్ అంటూ వీడియో షేర్ చేసిన సమంత..

Samantha Shares her Daily Routine Video goes Viral

Updated On : September 11, 2024 / 1:58 PM IST

Samantha : ఆరోగ్యం కోసం కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ యాక్టివ్ అవుతుంది. ఓ పక్క తన బిజినెస్ లు చూసుకుంటూ, సినిమాలు, సిరీస్ లు చేస్తూ, హెల్త్ పాడ్ కాస్ట్ లు చేస్తూ బిజీగానే ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది సమంత.

తాజాగా తన సోషల్ మీడియాలో తన డైలీ రొటీన్ ఇదే అని ప్రతి రోజు తను చేసే పనులు వీడియో రూపంలో షేర్ చేసింది సమంత. ఈ వీడియోలో.. సమంత ఉదయం 6.30 గంటలకు కాసేపు సూర్య రష్మీ కోసం బయట నిల్చోవడం, ఆ తర్వాత ఆయిల్ పుల్లింగ్, హెయిర్ మసాజ్, తర్వాత 7 గంటలకు వర్కౌట్స్, తర్వాత పూజ చేసి వర్క్ కి బయలుదేరేటప్పుడు కార్లో కూర్చొని కంటి రక్షణ కోసం కళ్లకు ఏదో పరికరం పెట్టుకుంది. 9 గంటలకు షూటింగ్స్ కోసం సెట్ లోకి, లేదా షూటింగ్స్ లేకపోతే వేరే వర్క్స్ కి వెళ్లడం, సాయంత్రం 6 గంటలకు రెడ్ లైట్ థెరపీ తీసుకోవడం, రాత్రి 7 గంటలకు పికెల్ బాల్ ఆడి, 9 .30 గంటలకు మెడిటేషన్ చేసి రాత్రి 10 గంటలకు పడుకుంటాను అని తెలిపింది.

Also Read : Nabha Natesh – Ritu Varma : కలిసి వర్కౌట్లు చేస్తున్న ఇద్దరు హీరోయిన్స్.. వీడియోలు వైరల్..

దీంతో సమంత డైలీ రొటీన్ వీడియో వైరల్ గా మారింది. అయితే ఉదయం, సాయంత్రం చేసేవి రెగ్యులర్ గా ఉన్నా మధ్యలో షూటింగ్స్ ని బట్టి పనులు మారుతూ ఉండొచ్చు. అలాగే తన డైలీ రొటీన్ లో ఎక్కువగా సమంత తన ఆరోగ్యం కోసమే కేటాయించడం గమనార్హం. మీరు కూడా సమంత డైలీ రొటీన్ వీడియో చూసేయండి..